వనపర్తిని క్రీడాహబ్‌గా మారుస్తాం
వనపర్తిటౌన్: క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని.. ఓటమిని ఆయుధంగా మలుచుకొని రెట్టింపు ఉత్సాహంతో గెలుపునకు ప్రయత్నించే వారే అసలైన క్రీడాకారులని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి అండర్–14 ఫుట్‌బాల్ క్రీడాపోటీల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వనపర్తిని క్రీడా హబ్‌గా మారుస్తామని, జిల్లాకేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు ప్రయత్నించాలన్నారు. త్వరలోనే రూ.7.50 కోట్లతో టర్ఫ్ మైదానం, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే క్రీడాకారుల కోసం 50 గదులతో వసతిగృహాన్ని సైతం నిర్మిస్తామని చెప్పారు. అండర్–14 ఫుట్‌బాల్ పోటీల్లో బాలికలు 20, బాలురు 20 జట్లు పాల్గొన్నాయి. బాలికల్లో నిజామాబాద్ జిల్లా మొదటి, అదిలాబాద్ జిల్లా రెండు, రంగారెడ్డి జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో హైదరాబాద్ జిల్లా మొదటి, మహబూబ్‌నగర్ జిల్లా రెండో, రంగారెడ్డి జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు జిల్లా క్రీడాశాఖ అధికారులు సుధీర్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య, లక్కాకుల సతీష్, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.
త్వరలో రూ.7.50 కోట్లతో టర్ఫ్ మైదానం ఏర్పాటు
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
శివసేనారెడ్డి,
ఎమ్మెల్యే మేఘారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment