వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈనెలాఖరులోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా రూ.4.35కోట్లు వసూలైతేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత దక్కుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. మరో ఎనిమిది మందికి మెమోలు జారీ చేయాలన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.33.75 కోట్ల తో పాటు పాత బకాయిల కింద రూ.18.25కోట్లు రావాల్సి ఉందని, ఇప్పటివరకు రూ.18.75 కోట్లు వసూలైందని ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా బదులిచ్చారు. సమావేశంలో ఆర్‌ఐలు అహ్మద్‌షరీఫ్, ముజీబుద్దీన్, టి.నర్సింహ, రమేష్, పెంటయ్య, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరి సస్పెన్షన్
మరో 8 మంది వార్డు ఆఫీసర్లకు మెమో జారీ
Comments
Please login to add a commentAdd a comment