ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి 130 అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేసవికాలం పూర్తయ్యే వరకు తాగునీటి, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. భూగర్భజలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోకుండా రైతులతో మాట్లాడి నీటి వృథా, పొదుపు, ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీలను రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిసరాలు పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఆర్‌డీఓ నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి
కలెక్టర్ విజయేందిర
అదనపు తరగతులు మంజురు చేయాలి
మహబూబ్‌నగర్ మండలంలోని గాజులపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో అదనపు తరగతి గదులను మంజురు చేయాలని విద్యా కమిటీ మాజీ చైర్మన్ నర్సింహులు కోరారు. ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో భోదన జరుగుతుంది. కానీ తరగతులు మాత్రం కేవలం నాలుగే ఉన్నాయని, ఈ తరగతుల్లోనే 10వ తరగతి వరకు కొనసాగడం విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. బీజేపీ నాయకులు సతీష్‌కుమార్, నాగరాజు, రవికుమార్, నర్సింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
క్యాలిఫర్ కేంద్రాన్ని ప్రారంభించాలి
జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ ఆస్పత్రిలో ఉన్న క్యాలిఫర్ కేంద్రాన్ని పున: ప్రారంభించాలి. ఈ కేంద్రంలో టెక్నిషన్ లేక రెండు నెలల నుంచి కేంద్రం మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ఏజిల్లాలో కూడా క్యాలిఫర్ కేంద్రం లేదని, ఉమ్మడి జిల్లా కేంద్రంలో మాత్రమే ఉన్న ఈకేంద్రం మూత పడడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పరికరానికై నా హైదరాబాద్‌కు పోవాల్సి వస్తుంది.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
Comments
Please login to add a commentAdd a comment