కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: భూ తగాదాలు కోర్టు ద్వారా లేదా పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని, అనవసరమైన ఆవేశాలకు వెళ్లి గొడవలు పెట్టుకోరాదని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు అందించారు. బాధితుల ఫిర్యాదులపై దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించేలా న్యాయం అందించాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే డయల్ 100 లేదా 1930 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
అలివేలు మంగ హుండీ లెక్కింపు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
336 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్, ఎకానమిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 12,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 11,787 మంది హాజరై, 336 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు పలు పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,959
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,959, కనిష్టంగా రూ.5,311 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,925, కనిష్టంగా రూ.5,200, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,189, ఆముదాలు గరిష్టంగా రూ.6,160, కనిష్టంగా రూ.6,080, జొన్నలు గరిష్టంగా రూ.4,377, కనిష్టంగా రూ.4,277,పెబ్బర్లు రూ.5,771, మినుములు రూ.7,171 ధరలు లభించాయి.
కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment