భవనం పూర్తికాగానే తరలిస్తాం
టీడీగుట్ట సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కూరగాయలు, మాంసం, చేపల అమ్మకాల కోసం నిర్మిస్తున్న అతి పెద్ద భవనం పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. కోస్గి రోడ్డుతో పాటు పాత బస్టాండు సమీపంలో, పాత రైతుబజార్‌లో అమ్మే వారినందరినీ అక్కడికి తరలిస్తాం. ఆయా రోడ్ల పైనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల అమ్మకంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది వాస్తవమే. గతంలో పలుసార్లు వీరిని తూర్పు కమాన్‌కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతుబజార్‌కు వెళ్లాలని సూచించాం. – డి.మహేశ్వర్‌రెడ్డి,
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్
వాహన రాకపోకలకు ఇబ్బందులు
పాత బస్టాండు చుట్టుపక్కల, కోస్గి రోడ్డుపై కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే భారీ వాహనాలతో పాటు బస్సుల రాకపోకలు విరివిగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోడ్లపై అమ్మే వర్తకులు గాని, రైతులు గాని తూర్పు కమాన్‌కు ఎదురుగా ఉన్న మోడ్రన్ రైతు బజార్‌కు వెళ్తే బాగుంటుంది. అక్కడ వినియోగదారులకు సైతం ఉపయోగకరంగానే ఉంది. – పగడం మల్లేష్, పద్మావతికాలనీ, మహబూబ్‌నగర్
మోడ్రన్ రైతు బజార్‌కు తరలించాలి
కోస్గి రోడ్డుపై మలుపులో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర నిత్యావ సర వస్తువులను కొనాలంటేనే భయమేస్తుంది. అటు వైపు చించోళి నుంచి పెద్ద లారీలు, ఇతర భారీ వాహనాలు వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో బైక్‌పై వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీగుట్ట వద్ద రైల్వే గేటు పడ్డప్పుడు ట్రాఫిక్‌జాం అవుతోంది. వందలాది వాహనాలు అటు కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు వరకు ఇటు క్లాక్‌టవర్ వరకు ఆగిపోతున్నాయి. వీటి మధ్యన నడవడానికి కూడా వీలుండదు. రోడ్డుపై అమ్మే వారిని మోడ్రన్ రైతుబజార్‌కు తరలించాలి. అక్కడ కూడా గిరాకీ అవుతుంది.
– వెంకటయ్య, రిటైర్డ్ ఉద్యోగి, లక్ష్మీనగర్‌కాలనీ, మహబూబ్‌నగర్
20 ఏళ్లుగా ఇక్కడే అమ్ముతున్నాం..
20 ఏళ్ల నుంచి భూత్పూర్ చౌరస్తాలో కూరగాయల అమ్ముతున్నాం. దుకాణాల ఎదుట కూరగాయలు పెట్టవద్దని వారు నిరాకరించడంతో కుటుంబ పోషణ కోసం రహదారిపైనే విక్రయాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రహదారి విస్తరిస్తున్నట్లు తెలిసింది. తమకు కూరగాయలు అమ్మడానికి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి.
– పి.బుచ్చయ్య, కూరగాయల వ్యాపారి, భూత్పూర్
భవనం పూర్తికాగానే తరలిస్తాం
భవనం పూర్తికాగానే తరలిస్తాం
భవనం పూర్తికాగానే తరలిస్తాం
Comments
Please login to add a commentAdd a comment