అన్ని సౌకర్యాలు కల్పించినా..
ఈ పరిస్థితులను అధిగమించడానికి 2018 సెప్టెంబర్‌లో తూర్పు కమాన్‌కు ఎదురుగా కొత్త మోడ్రన్ రైతుబజార్‌ను నిర్మించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం దక్కడం లేదు. సువిశాలమైన హాలులో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మటన్, చికెన్ విక్రయానికి సైతం షాపులు కేటాయించారు. మొదట్లో కొన్ని నెలలపాటు క్రయ విక్రయాలు బాగానే సాగాయి. అయితే ఆ తర్వాత పాత రైతు బజార్‌కే ప్రజలు వెళ్లడం ఆరంభించడంతో అప్పటి నుంచి మోడ్రన్ రైతు బజార్ వెలవెలబోతోంది. చాలా తక్కువ మంది రావడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. మరోవైపు మెట్టుగడ్డలోని డైట్ కళాశాల వద్ద, న్యూటౌన్ హైస్కూల్ వద్ద మరికొందరు వక్ఫ్ స్థలంలో షెడ్లు వేసుకుని కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతున్నారు.
అన్ని సౌకర్యాలు కల్పించినా..
Comments
Please login to add a commentAdd a comment