గడ్డివాములు దగ్ధం
అయిజ: మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామంలోని కురువ బాలప్ప, వడ్డెర తిమ్మప్పలకు సంబంధించిన గడ్డివాముల నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లభించలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి బాధితులకు రూ. 10వేలు ఆర్థిక సహాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment