
75 ట్రాక్టర్ల ఇసుక డంప్‌లు సీజ్
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారులోని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డపింగ్ చేయడంతో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డి, ఆర్‌ఐ రాఘవేందర్‌రావులు దాదాపు 75 ట్రాక్టర్ల ఇసుకను డంపింగ్ సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక డపింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్‌ఐ తెలిపారు.
భార్య హత్య కేసులో భర్త రిమాండ్
ఎర్రవల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తను రిమాండ్‌కు తరలించినట్లు ఇటిక్యాల ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. మండలంలోని సాతర్ల గ్రామానికి చెందిన షాలు తన భార్య సంసీన్ అలియాస్ నషియాబాను (32)తో మార్చి 30న గొడవ పెట్టుకొని ఆగ్రహంతో రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె కోమాలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 4న పరిస్థితి విషమించి మృతి చెందింది. ఆమె తల్లి మాసుంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అలంపూర్ సీఐ రవిబాబు కేసు విచారణలో భాగంగా మంగళవారం షాలును అరెస్ట్ చేసి అలంపూర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
యువకుల
మృతదేహాలు లభ్యం
మహబూబ్‌నగర్ క్రైం: దివిటిపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీకి చెందిన మహిమూద్ (24), అయ్యప్ప అలియాస్ సుశాంత్ (17) మృతదేహాలను క్వారీ గుంత నుంచి మంగళవారం సాయంత్రం అధికారులు వెలికితీశారు. విజయ్‌కుమార్ మృతదేహం సోమవారమే లభ్యం కాగా.. అయ్యప్ప, మహిమూద్ కోసం రాత్రి వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అగ్నిమాపకశాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం 5.40 ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
మోతీఘనపూర్‌లో..
రాజాపూర్ (బాలానగర్): బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతిచెందిన విషయం విధితమే. కాగా మంగళవారం ఉదయం శివకుమార్ మృతదేహం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ తెలిపారు. యాదయ్య మృతదేహం కోసం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది.