
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాలో క్రిస్టియన్లు ఆదివారం ఈస్టర్ పర్వదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లాకేంద్రంలోని కల్వరికొండపై వేడుకలను నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఏజే ఏసు ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి యేసుక్రీస్తూ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈస్టర్ పండుగ మీ అందరితో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కల్వరికొండను దశల వారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రూ.10.72 లక్షల జనరల్ ఫండ్ నిధుల ద్వారా నిర్మించిన సీసీరోడ్డు, వాటర్‌ట్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వేడుకకు క్రైస్తవులు వేలాదిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంబీసీ చర్చి చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ బీఐ జేకబ్, కార్యదర్శి జేఐ డేవిడ్, సహాయ కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ రాజ్, కోశాధికారి టీఏ స్టీవెన్, సహ కోశాధికారి ఎ.టైటస్ రాజేందర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి శామ్యుల్, చిన్నరాజు, ఎంపీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు