Top Stories
ప్రధాన వార్తలు

AP: ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూటమి సర్కార్ స్పందించడం లేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) ప్రతినిధులు ప్రకటించారు. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు.‘‘అప్పుల భారం మోయలేక, బాధలు భరించలేక.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రతీ నెలా నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి రూ.330 కోట్ల రూపాయల సేవలు అందిస్తున్నాం. బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సగం కూడా రావడం లేదు. నెట్ వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు రూ. 3500 కోట్ల వరకూ పేరుకుపోయాయి. మందులు, పరికరాలు అప్పులిచ్చే కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి. బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రులు వైద్యులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేవు’ అని హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొందని మార్చి 7న నోటీసు పంపించాం. నోటీసు పంపించిన తర్వాత రూ.350 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మేం ఎప్పుడు డబ్బులు అడిగినా పాత బకాయిలు చెల్లించామనే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం చెల్లించే దానికంటే మేం ఎక్కువగానే సేవలు అందిస్తున్నాం. తొంభై శాతం ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 3300 ప్యాకేజీలకు సేవలు అందిస్తున్నాం. ప్రతీ నెలా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల మనుగడే కష్టంగా మారింది. మాకు ఉన్న బకాయిల్లో రూ.1500 కోట్లు అత్యవసరంగా చెల్లించాలి. అలా చెల్లించలేని పక్షంలో మా సర్వీసులను మొదలు పెట్టే పరిస్థితి లేదు. కొత్త ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కు వెళ్లేముందు ప్రభుత్వం మా బకాయిలన్నీ చెల్లించాలి’’ అని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారబోతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వోత్కర్షలకు పోవచ్చు. కానీ క్లిష్ట సమయాలే ఎవరేమిటన్నది నిగ్గుదేలుస్తాయి. బిల్లు పార్లమెంటులో గట్టెక్కడం మాట అటుంచి టీడీపీ ఇన్నాళ్లుగా వేస్తున్న సెక్యులర్ వేషాలకు తెరపడింది. టీడీపీ, జేడీ(యూ)ల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్నే నడపటం సాధ్యం కాని దీనస్థితిలోవున్న ఎన్డీయే సర్కారు... ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై సునాయాసంగా తన పంతం నెగ్గించు కోవటం ఎలా సాధ్యమైందో అందరికీ తేటతెల్లమైంది. వీరితోపాటు మొదట వీరావేశంతో మాట్లాడిన ఒడిశాకు చెందిన బీజేడీ ఆఖరి నిమిషంలో స్వరం మార్చి పార్టీ ఎంపీలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించటం ప్రభుత్వానికి కలిసొచ్చింది. నిరుడు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆదరా బాదరాగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపక తప్పలేదు. ఎన్డీయే సర్కారు ఏర్పాటైన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్లటం అదే ప్రథమం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి, ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించటం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగింది. అందుకే వక్ఫ్ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుందని అధికారపక్షం నిర్ణయానికొచ్చింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. ఎన్నడో 1954లో వచ్చిన తొలి వక్ఫ్ చట్టం అవసరాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో 1995లో దాని స్థానంలో మరో చట్టం తీసుకొచ్చారు. 2013లో సవరణలు చేశారు. అయినా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల్లో దాదాపు సగంవరకూ వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించి సమస్యలున్నాయి. అవినీతి ఉన్నదనీ, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆరోపణలు రావటం కూడా వాస్తవం. పారదర్శకత పాటించటంలేదన్న విమర్శ కూడా ఉంది. వీటిని సరిదిద్దాలంటే ముస్లిం పండితులతో, నిపుణులతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలతో మాట్లాడాలి. ఎలావుంటే బాగుంటుందన్న అంశంలో సూచనలూ, సలహాలూ తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా బిల్లు తీసుకురావటంతో ముస్లిం వర్గాల్లో సంశయాలకు అవకాశం ఏర్పడింది. ముస్లింల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పటం బాగానేవున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది.బుజ్జగింపు ధోరణితో, ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టితోనే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తాను చేసిందేమిటో ఆలోచించిందా? నిజంగా చిత్తశుద్ధి వుంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆ వర్గాలతో చర్చించటానికి అభ్యంతరమేమిటి? ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజా యిషీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించి వక్ఫ్ కౌన్సిళ్లు జోక్యం చేసుకోబోవని, కేవలం వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలనే చూస్తాయని కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు చెబుతున్నారు. కానీ మౌలికంగా వక్ఫ్ ఆస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తిభావనతో మతపరమైన అవసరాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి. అటువంటప్పుడు ఆ ఆస్తుల నిర్వహణలో అన్యులకు చోటీయటం అసమంజసం కాదా? ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? ఒకవేళ అలా ఇచ్చినా అందుకు ఆ మతస్తులు అంగీకరిస్తారా? ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్‌కు ఇవ్వొచ్చన్న నిబంధన ఉండేది. కానీ తాజా సవరణ ప్రకారం అయిదేళ్లపాటు ఇస్లామ్‌ను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది. అయితే ఇస్లామ్ ఆచరణే మిటో బిల్లు వివరించలేదు. 2013లో ఆ మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఆదరా బాదరాగా వక్ఫ్ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అందువల్ల ఒక్క ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఆ సవరణలను నాటి బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, సుష్మాస్వరాజ్ సమర్థించారు. సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంలో తోడ్పడ్డారు. వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగావున్న 20 కోట్లమంది ముస్లింలలో ఎన్నో సంశయాలున్నాయి. బిల్లులోని నిబంధనలు ఆ సంశయాలను మరింత పెంచేవిగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల్ని ఆర్నెల్లలోపు డేటా బేస్‌లో నమోదు చేయనిపక్షంలో వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాల మెట్లెక్కటం అసాధ్యమని బిల్లు చెప్పటం సమంజసంగా అనిపించదు. వివాదంలో పడిన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం కావటం కూడా సమస్యాత్మకం. ఏ ఉన్నతాధికారైనా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం సాధ్యమేనా? ఇది అనుమానాలు రేకెత్తించే అవకాశం లేదా? మొత్తానికి తెలుగుదేశం వంటి పక్షాలు బిల్లుకు ఓటేసి, ఆపైన సవరణలు తీసుకొచ్చామంటూ లీకులిస్తూ, తమ సవరణలతో బిల్లు పకడ్బందీగా వచ్చింద నడం హాస్యాస్పదం. అందులోని డొల్లతనం ఏమిటో ఈ నిబంధనలే చెబుతున్నాయి. క్లిష్ట సమయాల్లో తటస్థత వహించటం ద్రోహంతో సమానం. తటస్థత మాట అటుంచి నిస్సంకోచంగా బిల్లును సమర్థించి టీడీపీ తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు.

వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి రా.1.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మృగశిర ఉ.11.16 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.25 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.11వరకు, తదుపరి ప.12.26 నుండి 1.15 వరకు, అమృత ఘడియలు: రా.12.46 నుండి 2.20 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.57, సూర్యాస్తమయం: 6.10. మేషం... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వృషభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మిథునం... బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.సింహం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.కన్య...... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వృశ్చికం..... కుటుంబసమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.కుంభం.. వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.మీనం... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

ప్రతీకారం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం సుంకాలను యూరప్ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్ లెయన్ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్‌ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కియిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్–జపాన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్ ట్రంప్ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్ వైన్, స్పిరిట్స్ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్‌లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్

కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల ‘కంచ గచ్చి బౌలి’ భూమిని, రేవంత్ రెడ్డి సర్కార్ వేలానికి పెట్టింది. వేలం వద్దని విద్యార్థులు జేఏసీగా ఏర్పడి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉగాది పండగ రోజున ఆ ప్రాంతపు చెట్లను తొలగించి, మట్టిని చదును చేయడానికై 50 భారీ బుల్డోజర్లు, పొక్లైన్లతో, వందలాది మంది పోలీసులు ఆ భూమిలోకి వెళ్లారు. వాటిని అడ్డుకోవడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. జుట్టు పట్టి ఈడ్చి వాహనాల్లో పడేశారు. 200 మందిని, 4 పోలీస్ స్టేషన్లకు తరలించారు. చివరికి ఈ వ్యవహారం దేశ అత్యు న్నత న్యాయస్థానానికి చేరడంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఆదేశాలు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను 100 కోట్లకు ఎకరం అమ్మింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పూనుకున్న కంచ గచ్చి బౌలి భూమి ఎకరాకు 100 కోట్ల పైమాటే. 400 ఎకరాలను వేలం వేస్తే 40 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం దృఢంగా భావించింది.అందుకే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తీవ్ర హింసకు పూనుకుంది. తద్వారా ఎన్నికల ప్రణాళి కలో ఇచ్చిన 7వ హామీ ‘ప్రజాస్వామ్య హక్కుల రక్షణను పాతిపెట్టినట్లే’!‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బడా సంపన్నుల సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే’ అని ఒక జర్మన్ తత్వ వేత్త అంటారు. అంటే సామాన్య మెజారిటీ ప్రజలు కేంద్రంగా ప్రభుత్వాలు పనిచేయవని ఉద్దేశం. హెచ్‌సీయూ భూములను అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమ లను అమ్ముతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు పైవాక్యం సరిగ్గా సరిపోతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు అమ్ముతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను బడా కార్పొరేట్లకు అమ్మకానికి పూనుకుంది. ఇది ఈ దేశ విద్యార్థుల వైజ్ఞానిక భవిష్యత్తుకు విద్రోహం తలపెట్టడమే! ఉన్న ప్రభుత్వ వనరులను తెగనమ్మడానికి బదులు.... ప్రత్యామ్నాయంగా మోదీ–రేవంత్ బడా సంపన్నులపై ‘ప్రగతిశీల పన్ను’ ఎందుకు వేయకూడదు? అవినీతి సొమ్మును, లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రజల ప్రయోజనం కొరకు వెలికి తీసి, ఎందుకు వినియోగించకూడదు?పాలకులు ప్రజల ఆస్తులు అమ్మడమే ఏకైక పనిగా సాగుతున్నారు. దశాబ్దాలుగా పథకం ప్రకారం విశ్వవిద్యాలయం భూములకు కోత విధిస్తున్నారు. కేసీఆర్... ప్రభుత్వ భూములను అమ్మితే దునుమాడిన రేవంత్ రెడ్డి... అదే పనికి ఇప్పుడు పూనుకున్నారు. ఈ చర్య అక్కడి జీవా వరణ – పర్యావరణ స్థితిని నాశనం చేస్తుంది. హెచ్‌సీయూ వెల్లడించిన సమాచారం ప్రకారం 734 రకాల పూల మొక్కలు, 10 క్షీరద జాతులు, 15 రకాల సరీసృపాలు, నెమళ్లు లాంటి 220 రకాల పక్షులు, రెండు చెరువులు ఇక్కడ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పోలి ఉండే ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్ల అమరికలు ఈ 400 ఎకరాలలో ఉన్నాయి. ఈ ప్రకృతి వైవిధ్యాన్నీ, దేశ భవిష్యత్తునూ ప్రభుత్వం విధ్వంసం చేయతల పెట్టింది. విశ్వవిద్యాలయ భూమిలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని బుకాయిస్తోంది. ఇటీవలే చైనాలో మన హెచ్‌సీయూ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులే ‘డీప్ సీక్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను, అతి చౌకగా ఆవిష్కరించారు. అమెరికా టెక్ ఆధిపత్యాన్ని కూల్చారు. భూములను అమ్మడం కంటే, ప్రపంచ ప్రమాణా లతో కూడిన, ఆధునిక మానవ అవసరాలను నెరవేర్చే చదు వులు మరింత భారీ డబ్బును సమీకరిస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో నెలకొల్పుదామనే ప్రపంచ కంపెనీలు, ఈ విశ్వ విద్యాలయాల్లో చదివిన విద్యా ర్థులు సృష్టించే సంపద కంటే గొప్పవేం కాదు. ‘అక్కడ పులులు జింకలు లేవు. కొన్ని నక్కలు మాత్రమే అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నాయి. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చ గొడుతున్నాయ’ని ముఖ్య మంత్రి మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. గురువారం (ఏప్రిల్ 3వ తేదీ) సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం అసలు అది అటవీ భూమికాద’ని బుకాయించడమూ తెలిసిందే. ప్రభుత్వ విలువైన భూములను, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారా దత్తం చేయకూడదని 2012 సెప్టెంబర్ 14న విడుదలైన జీఓఎమ్ఎస్ నం. 571 స్పష్టంగా చెబుతోంది. వనరుల సమీకరణ కొరకు ప్రభుత్వ భూములను అమ్మడం, వేలం వేయడం వల్ల భూమి తీవ్రంగా తగ్గిపోయి అన్యాక్రాంతమవు తుంది. దీనివల్ల సమాజ భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఈ జీవో పేర్కొంటున్నది. ప్రభుత్వ భూముల వినియోగం, అత్యంత శాస్త్రీయంగా న్యాయబద్ధంగా ఉండాలని ఈ జీఓ చెబుతోంది. ప్రజల ప్రయోజనం కొరకే భూములను కేటాయించాలి. ఆ భూమి వల్ల వచ్చే భవిష్యత్ ప్రయోజనాలన్నీ ప్రజలకే చెందాలి. ప్రజా ప్రయోజనాలకు ఇవ్వ వలసి వస్తే బంజరు భూములను, డ్రై ల్యాండ్స్‌ను మాత్రమే కేటాయించాలి. రెండు పంటలకు సాగు నీటి వసతి గల భూములను అసలు కేటాయించడానికి వీలు లేదు. పర్యావరణపరంగా సున్నితమైన భూములను, ట్యాంక్ బెడ్స్‌ను, రివర్ బెడ్స్‌ను, కొండలను, అడవులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. ప్రభుత్వ భూము లను, నిధుల సమీకరణ కొరకు, ఎట్టి పరిస్థితులలో వేలం వేయరా దని ఈ జీఓ స్పష్టం చేస్తోంది.హెచ్‌సీయూ భూమి పర్యావరణపరంగా సున్నితమైంది. హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తి లాంటిది. నీరు ఇంకడానికి భూగర్భ నీటిమట్టాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతోంది. ఇంత విలువైన భూములను, ప్రైవేట్ బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యమా? ఈ సంగతులన్నింటినీ గ్రహించింది కాబట్టే సుప్రీం కోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఈ భూముల్లో ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలనూ నిర్వహించకుండా స్టే విధించింది. ఈ నెల 16న తిరిగి ఈ కేసుపై వాదనలు వింటామనీ, అప్పటికి ఈ భూములపై సమగ్ర నివేదికను తయారుచేసి తమకు సమర్పించాలనీ ఆదేశించింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని వేరే చెప్పనవసరం లేదు కదా!నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ ‘ 97013 81799

దాడి కోసం సాకుల వెతుకులాట
ఇరాన్ అణు కార్యక్రమం గురించి మార్చి 25న ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. బయట అంతగా ప్రచారంలోకి రాని ఆ నివేదిక, అమెరికాకు చెందిన 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి రూపొందించింది. వాటిలో సీఐఏ, పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటివి ఉండటం గమనించదగ్గది. ఆ నివేదికను బట్టి, ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, చేయాలని కూడా అనుకోవటం లేదు.ఇది ఇరాన్ నాయకత్వం స్వయంగా చెప్తున్న విషయమే!్డ అయి నప్పటికీ అమెరికా నాయకత్వం, ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తుందా అనిపించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేస్తూ వస్తున్నాయి. అణ్వస్త్రాల ఉత్పత్తికి వీలు లేదని అమెరికా హెచ్చరిస్తుండగా, అసలు శాంతియుత ఉపయోగానికా లేక ఆయుధాల కోసమా అనే దానితో నిమిత్తం లేకుండా అణు పరిశోధనలనే సహించబోమని ఇజ్రాయెల్ వాదిస్తున్నది. చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ...వాస్తవానికి ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలన్నీ ఐక్యరాజ్య సమితి అణుసంస్థ పర్యవేక్షణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ పరిశోధనలు, వాటి నియంత్రణల విషయమై పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధమని గతంలోనూ ప్రకటించిన ఇరాన్ నాయకత్వం, నిరుడు ఇజ్రాయెల్‌తో క్షిపణుల రూపంలో ప్రతి దాడుల తర్వాత మరొకమారు స్పష్టం చేసింది. అటువంటి అంగీకార పత్రం ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ) పేరిట 2015 నుంచి ఉండేది కూడా! కానీ ట్రంప్ పోయినమారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దాని నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నది. ఇపుడు తిరిగి ఆ విషయమై చర్చలకు యూరోపియన్ దేశాలు సుముఖంగా ఉన్నా ఇజ్రాయెల్ అంగీకరించటం లేదు. అమెరికా ఒకవైపు చర్చలంటూ, మరొకవైపు బాంబింగ్ అని బెదిరిస్తున్నది. అయితే చర్చలు మధ్యవర్తుల ద్వారా తప్ప ప్రత్యక్షంగా జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేస్తున్నది.దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అమెరికా, ఇజ్రాయెల్‌లకు కావలసింది ఇరాన్ శాంతియుత వినియోగానికైనా సరే అణు పరిశో ధనలు జరుపుకొనేందుకు వీలు లేదు. ఇరాన్ నుంచి అమెరికాకు మధ్య సుమారు 7,000 మైళ్లు, యూరప్‌తో సుమారు 1,500 మైళ్ల దూరం ఉంది. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనుకున్నా వాటి నుంచి ముప్పు ఉండేది మొదట యూరప్‌కు. అయినప్పటికీ ఇరాన్ ప్రతిపాదించిన ప్రకారం చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ అణ్వస్త్ర ప్రయోగం అమెరికాపై చేయాలంటే వాటిని అంతదూరం మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణులు, బాంబర్లు అవసరం. ఇరాన్ వద్ద ఇటు అణ్వస్త్రాలుగానీ, అటు క్షిపణులూ బాంబర్లుగానీ లేవని అమె రికాకు తెలుసు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్ద అవన్నీ వేలాదిగా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకీ వైఖరి? ఇక్కడ అర్థమవుతుంది రహస్యం. ఇరాన్ భౌగోళికంగా పశ్చిమాసియాలో భాగం. ఆ ప్రాంతం యావత్తూ పాశ్చాత్య శక్తులకు రెండు కారణాల వల్ల ముఖ్యమైనది. ఒకటి – తమ సామ్రాజ్యవాద భౌగోళిక వ్యూహాల దృష్ట్యా. రెండు, ఇరాన్ సహా ఆ ప్రాంతపు దేశాలన్నింటా గల అపారమైన చమురు నిక్షేపాలు. గాజా యుద్ధం ముమ్మరంగా సాగుతుండిన రోజుల్లో ఇజ్రాయెల్ తాము గాజాతో ఆగబోమని, మొత్తం పశ్చిమాసియా చిత్రాన్నే మార్చివేయగలమని ప్రకటించింది. ఆ మార్పులో భాగంగా ఇరాన్ ప్రస్తుత నాయకత్వాన్ని లేకుండా చేయగలమని బాహాటంగా హెచ్చరించింది. ఇరాన్లో ప్రస్తుత నాయకత్వం పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. కానీ ఆ స్థాయి ఎక్కడైనా మామూ లుగా ఉండేదేగానీ తీవ్రమైనది కాదు. అటువంటిది ఉంటే ప్రజాగ్రహంతో ఇరాన్ షా 1979లో పతనమైనట్లు జరిగేది. లేదా యూరప్‌లోని జార్జియా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, యుగోస్లావియా వంటి దేశాలలో సీఐఏ ప్రోత్సాహంతో ‘కలర్ రివల్యూషన్స్’ పేరిట ప్రభుత్వాలను కూలదోయటం, దేశాలనే చీల్చటం చేసినట్లు జరిగి ఉండేది. కానీ అవేవీ సాధ్యం కాగల పరిస్థితులు ఇరాన్లో లేవు.నేను ఒకసారి వారం రోజులపాటు ఇరాన్లో ఉండటం తటస్థించింది. అంతకు ముందు మొహమ్మద్ రజా పహ్లవీ చివరి నియంతగా ఉండిన కాలంలో, ఇండియాలోని పలు నగరాలలో చదువుతుండిన ఇరానియన్ విద్యార్థులు మా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వచ్చి కొద్ది రోజుల చొప్పున హాస్టళ్లలో బస చేసి, షా పాలన పట్ల నిరసనలు ప్రకటించి వెళుతుండేవారు. అలాగే పాశ్చాత్య దేశాల పన్నుగడల పట్ల ఆ ప్రజల వ్యతిరేకతలు ఎంతటివో కూడా వారి ద్వారా తెలుస్తుండేవి. షా ప్రభుత్వంతోపాటు పహ్లవీ వంశ రాచరికం కూలిన దశాబ్దాల అనంతరం సైతం పాశ్చాత్య శక్తుల పట్ల వ్యతిరేకతలు ఎంతమాత్రం మారలేదని నేనక్కడ ఉన్న రోజులలో అర్థమైంది. అందుకు కారణం తమ పట్ల అమెరికా కూటమి విధానాలుగానీ, ఇజ్రాయెల్ కేంద్రిత వ్యూహాలుగానీ మారక పోవటమే!ఇరానే ఎందుకు లక్ష్యం?పాలస్తీనా సమస్యపై అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధాలలో ఇజ్రాయెల్ గెలవటం, ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాసర్ మృతితో పాన్ అరబిజం బలహీన పడటంతో అరబ్ రాజ్యా లకు ఇజ్రాయెల్ పట్ల రాజీ వైఖరి, అమెరికా కూటమి పట్ల సఖ్యత మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ను గుర్తించి దౌత్య సంబంధాలు నెల కొల్పుకోసాగాయి. పాలస్తీనాను నెమ్మదిగా మరచిపోయాయి. పాలస్తీనా నాయకుడు అరాఫత్ 2004లో మృతి చెందిన తర్వాత కొత్తగా అధికారానికి వచ్చినవారు అమెరికా, ఇజ్రాయెల్‌లకు పూర్తిగా మచ్చిక అయిపోయారు. హమాస్ కారణంగా ఇటీవలి యుద్ధం తలెత్తకపోయి ఉంటే బహుశా పాలస్తీనా విషయం అన్నదే క్రమంగా మరుగున పడేది. అరబ్ రాజ్యాలన్నీ పాలస్తీనాను ఇంచుమించు వదిలివేయగా, బలమైన మద్దతుగా నిలిచిన దేశం ఇరాన్. ఆసక్తికరం ఏమంటే, సున్నీ ముస్లిం దేశమైన పాలస్తీనాను సున్నీ అరబ్ రాజ్యాలు వదలివేయగా, షియా రాజ్యమైన ఇరాన్ వారి వెంట నిలిచింది. వారికి ఇరాన్ కనీసం పొరుగు దేశమైనా కాదు. పాలస్తీనా సమస్యతో తనకేమి సంబంధం అని భావిస్తే అడిగేవారు లేరు. అయినా ఇటువంటి వైఖరి తీసుకోవటం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎంత మాత్రం సరిపడనిది అయింది. ఇరాన్‌తో అరబ్ దేశాలకూ సున్నీ–షియా భిన్నత్వం కారణంగా అరకొర సంబంధాలు మాత్రమే ఉన్నాయి.ఈ మొత్తం పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే ఇజ్రాయెల్, అమెరికాలకు ఏకైక శత్రు దేశంగా మిగిలింది. లెబనాన్, సిరియా, హిజ్బుల్లా, హౌతీలను ఏదో ఒక విధంగా దారికి తెచ్చు కోవచ్చు. కానీ ఇరాన్ సాధారణమైన శక్తి కాదు. అది గాక దాని వెంట రష్యా, చైనా ఉన్నాయి. పైపెచ్చు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిపాయి. అణు రంగం విషయమై కూడా త్రైపాక్షిక చర్చలు నిర్వహించాయి. అణు ఇంధనం ఇరాన్ రియాక్టర్లలో ప్రస్తుతం 60 శాతం మేరకు శుద్ధి అయి ఉంది. శాంతియుత వినియోగానికి అది అవసరం. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి కావాలి. ఆ స్థాయికి వెళ్లగల సాంకేతిక శక్తి ఇరాన్‌కు ఉంది. కానీ అటువంటి ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమంటూ పాతికేళ్ల క్రితం ప్రకటించిన అధినాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం చేయదలచిన వారికి సాకులు కరవా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కేకేఆర్..
KKR vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(2), హెడ్(4), ఇషాన్ కిషన్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు సాధించగా.. రస్సెల్ రెండు, హర్షిత్ రాణా, నరైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్హెచ్కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన క్లాసెన్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్..7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(14), హర్షల్ పటేల్(1) ఉన్నారు.12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 84/612 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(13), ప్యాట్ కమ్మిన్స్(6) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన నితీశ్ కుమార.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(22), క్లాసెన్(1) ఉన్నారు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లుకష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తడబడుతోంది. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ(2) తీవ్ర నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రింకూ సింగ్(24) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌రఘువన్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రఘువన్షి.. కమిందు మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్(5), రింకూ సింగ్(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్.. రహానే ఔట్‌అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రహానే.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(49), వెంకటేష్ అయ్యర్(1) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రహానే, రఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య రహానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఔట్ కాగా.. రెండో ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్(7) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రహానే(1), రఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్ వచ్చారు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అందమైన భామలు... అదిరిపోయే లుక్కులు
సిల్వర్ స్క్రీన్‌పై అందంగా మెరిసిపోతుంటారు కథానాయిలు. ఫర్ ఎ చేంజ్ డీ గ్లామరస్‌గా కనిపించే అవకాశం వస్తే... ‘సై’ అంటారు. అలాంటి పాత్రలు చేసినప్పుడు దక్కే కిక్కే వేరు అంటున్నారు ఈ భామలు. గ్లామర్.. డీ గ్లామర్... ఏదైనా కొందరు తారలు ప్రస్తుతం అదిరిపోయే లుక్కుల్లో కనిపించడం మాత్రమే కాదు... నటనపరంగానూ విజృంభిస్తున్నారు. అదిరిపోయే లుక్కుల్లో కనిపించనున్న ఆ అందాల భామల గురించి తెలుసుకుందాం.ప్రతీకారంతో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన తాజా సినిమా ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) మూవీ తర్వాత అనుష్క టాలీవుడ్లో కమిటైన చిత్రమిది. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారట.బిజినెస్ ఉమన్‌గా సత్తా చాటుతున్న ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. ఈ కారణంగా వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని టాక్. ఈ చిత్రంలో దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ని తమిళ నటుడు విక్రమ్ ప్రభు పోషించారు. అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిన ‘ఘాటీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషల్లో ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్ ఆరంభమైనా చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో విడుదల ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.ఇటు అమ్మోరు తల్లి... అటు రాక్షసి...ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు నయనతార. అలాగే డిఫరెంట్ రోల్స్ చేయడంలోనూ ఆమె ముందుంటారు. నటనలో వైవిధ్యం చూపిస్తుంటారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. సుందర్.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపిస్తారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్నీ సినీమ్యాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ఇటీవల మొదలైంది. ఇక 2020లో నయనతార లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్‌గా ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘రాక్కాయీ’ సినిమాలో తన చిన్నారిని రక్షించేందుకు ఎంతటి సాహసాలనైనా చేసే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార గెటప్ కొత్తగా ఉంటుంది. సెంథిల్ నల్లస్వామి డైరెక్షన్లో డ్రమ్‌స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వెర్స్ ఇండియా సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.నాగ సాధువుగా...ఓ వైపు హీరోయిన్గా, మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాటల్లో సందడి చేస్తున్నారు తమన్నా. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజయే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించారు. తొలి భాగంలో జోడీగా నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా మలిభాగంలోనూ నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటించారు తమన్నా. ఓదెల గ్రామానికి ఊహించని కష్టం వస్తుంది. ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న స్వామి నాగ సాధు (తమన్నా) పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సూపర్ హిట్ కావడంతో ‘ఓదెల 2’పై భారీ అంచనాలున్నాయి. రివాల్వర్ పట్టిన రీటా...‘నేను శైలజ’ (2016) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి. ఆమె టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్సీ కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్ స్టూడియోస్ అండ్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనీస్వామి నిర్మించారు. కామెడీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రీటా అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను హాస్య మూవీస్ అధినేత, నిర్మాత రాజేశ్ దండా సొంతం చేసుకున్నారు.డీ గ్లామరస్‌గా బుట్టబొమ్మ... తెలుగు తెరపై బుట్టబొమ్మలా పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపించారు. ఎన్నో గ్లామరస్ రోల్స్ కూడా చేశారు. కానీ రొటీన్‌కి డిఫరెంట్‌గా పూజా హెగ్డే తొలిసారిగా ఓ డీ గ్లామరస్ రోల్ చేశారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘రెట్రో’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ ‘రెట్రో’ మూవీలోనే పూజా హెగ్డే డీ గ్లామరస్ రోల్ చేశారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘రెట్రో’ మే1న విడుదల కానుంది. ఇంకా రాఘవా లారెన్స్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ లేటెస్ట్ మూవీ ‘కాంచన 5’లో పూజా హెగ్డే ఘోస్ట్ రోల్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే... పూజాకు ఈ రోల్, గెటప్ కూడా సరికొత్తదే.సీతగా సాయిపల్లవి... పల్లెటూరి అమ్మాయిలా, స్టూడెంట్‌లా... ఇలా హీరోయిన్ సాయిపల్లవి ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ ఇప్పటివరకు ‘రామాయణం, మహాభారతం’ వంటి ఇతిహాసాల నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో సాయి పల్లవి స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే సీతగా సాయిపల్లవి ఎంత అద్భుతంగా వెండితెరపై మెరిసిపోతారో, వచ్చే ఏడాది దీపావళికి సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీ తీస్తున్నారు.ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవిదుబే, హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని సమాచారం. నితీష్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలీవుడ్లో సాయిపల్లవి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే హిందీలో సాయి పల్లవి ‘ఏక్ దిన్’ అనే లవ్‌స్టోరీ మూవీ కూడా చేశారు. ఆమిర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.మహిళల చుట్టూ పరదా...అనుపమా పరమేశ్వరన్ కూడా జోరుమీదున్నారు. అటు హీరోయిన్గా, ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియాపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. వైవిధ్యమైన సోషియో డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు అనుపమ. ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ‘పరదాలమ్మా పరదాలు... రంగురంగుల పరదాలు... డిజైనర్ పరదాలు.... తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనుపమ చెప్పే డైలాగులకి మంచి స్పందన వచ్చింది. మహిళల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేటిని ప్రకటించనున్నారు మేకర్స్. స్వారీకి సై...‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సంయుక్త. ఆ తర్వాత ‘బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. ప్రస్తుతం తెలుగులోనూ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. ‘స్వయంభూ, నారి నారి నడుమ మురారి, హైందవ, అఖండ 2: తాండవం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారు.ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ మూవీలో సంయుక్త కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉందట. ఈ స్టంట్స్ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సంయుక్త. మరి.. ఆమె పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. ఇదిలా ఉంటే... సంయుక్త టిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్ హీరోగా రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్త. యువరాణి పంచమి‘సవ్యసాచి’ (2018) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిధీ అగర్వాల్. ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ మూవీ మే 9న విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. పంచమి అనే యువరాణి పాత్రలో నిధీ అగర్వాల్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆమె పాత్రకు చాలాప్రాధాన్యం ఉంటుందట. ఈ కథానాయికలే కాదు... ఇంకొందరు కూడా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, మెప్పించనున్నారు.
డోజ్ నుంచి వైదొలగను: మస్క్
నోబెల్ గ్రహీత వీసా రద్దు
ప్రతీకారం తప్పదు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
న్యాయం కోసం..
కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
దాడి కోసం సాకుల వెతుకులాట
అందమైన భామలు... అదిరిపోయే లుక్కులు
డోజ్ నుంచి వైదొలగను: మస్క్
నోబెల్ గ్రహీత వీసా రద్దు
ప్రతీకారం తప్పదు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
న్యాయం కోసం..
కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
దాడి కోసం సాకుల వెతుకులాట
అందమైన భామలు... అదిరిపోయే లుక్కులు
సినిమా

నితిన్‌తో లిప్‌లాక్ చేయలేనన్న నటి..ఇప్పుడేమో గ్లామర్ షోకి సై!
నటీనటులు ట్రెండ్‌కు తగ్గట్లు మారాలి. అప్పుడే వరుస అవకాశాలు వస్తాయి. అలా కాదని పరిమితులు విధిస్తే అక్కడే ఆగిపోతారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఒకప్పుడు స్కిన్ షోకి దూరంగా ఉన్న కీర్తి..ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఎక్స్ఫోజింగ్కి తాను కూడా రెడీ అంటోంది. సర్కార్ వారి పాట సినిమాతోనే తనలోని గ్లామర్ యాంగిల్‌ని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి.బాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'లో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఆ సీన్లకు ఎస్ చెప్పడంతోనే కీర్తికి ఆ చాన్స్ వచ్చిందట. అయితే ఇంతకంటే తక్కువ రొమాన్స్ ఉన్న పాత్రలను సైతం ఒకప్పుడు కీర్తి రిజెక్ట్ చేసిందట.లిప్‌లాక్ సీన్ ఉందని నితిన్ ‘మ్యాస్ట్రో’ని వదులుకుందట. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా కీర్తినే అనుకున్నారు. కథ మొత్తం విని లిప్‌లాక్ సీన్ ఉందని, అలాంటి సన్నివేశాల్లో నటించలేనని చెప్పిందట. ఇది నాలుగేళ్ల కిందటి మాట. అదే ఇప్పుడు అయితే కీర్తి లిప్‌లాక్ సీన్‌కి నో చెప్పేది కాదేమో. అప్పుడే ఇలాంటి సీన్లకు రెడీ అని చెబితే..ఆమె ఖాతాలో చాలా సినిమాలు చేరేవి. రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగేది. ఏది ఏమైనా మహానటిలో మార్పు వచ్చింది. పోటీ ప్రపంచంలోనే కొనసాగాలంటే స్కిన్ షో చేయాల్సిందేనని రియలైజ్ అయినట్లు ఉంది. ఇప్పుడైనా వరుస అవకాశాలు వచ్చి మళ్లీ బిజియెస్ట్ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి.

'అతనే నా భర్త కూడా'.. ఆర్జే మహ్వశ్ వీడియో వైరల్!
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలైన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో దుబాయ్ స్టేడియంలో మెరవడంతో ఒక్కసారిగా వీరిద్దరిపై చర్చ మొదలైంది. ఈ జంట డేటింగ్ ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల లక్నోలోని ఓ హోటల్లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే చాహల్ ఐపీఎల్ మ్యాచ్ కోసమే తాను అక్కడికి వెళ్లిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తనపై వస్తున్న డేటింగ్ వార్తల నేపథ్యంలో తాజాగా ఆర్జే మహ్వశ్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ చేసిన రీల్లో తన జీవితంలో రాబోయే వ్యక్తి గురించి ప్రస్తావించింది. నా లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తే నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో పాటు తనే నా భర్త కూడా అవుతాడు.. అంతేకాదు నేను అతని చుట్టూ తిరుగుతానంటూ మాట్లాడింది. అయితే ఈ వీడియోకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ లైక్ కొట్టాడు. దీంతో మీ జీవితంలో యుజ్వేంద్ర చాహల్ రాబోతున్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే చాహల్‌కు తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్జే వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash)

ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025

తమన్నాలా నేనెప్పుడు చేయలేదు: హెబ్బా పటేల్
‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
క్రీడలు

పాక్ క్రికెట్ జట్టుకు మరోసారి జరిమానా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింది. ఫలితంగా ఆ జట్టుకు భారీ జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టు నిన్న (ఏప్రిల్ 2) జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్ణీత సమయం పూర్తయ్యే లోపు ఓ ఓవర్ వెనుకపడింది.ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఓ జట్టు నిర్ణీత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయని పక్షంలో ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్ణీత సమయంలోపు ఓ ఓవర్ వెనుకపడింది. ఫలితంగా ఆ జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు.అంతకుముందు తొలి వన్డేలోనూ పాక్ స్లో ఓవర్ రేట్ తప్పిదం చేసింది. ఆ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా రెండు ఓవర్లు తక్కువ వేసింది. ఫలితంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో పది శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ విషయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ శిక్షను అంగీకరించడంతో ఐసీసీ ఎలాంటి విచారణ నిర్వహించలేదు. స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేసిన రెండు వన్డేల్లో పాక్ ఘోర పరాజయాలు ఎదుర్కొని 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. నామమాత్రపు మూడు వన్డే ఏప్రిల్ 5న మౌంట్ మాంగనూయ్‌లో జరుగనుంది.వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా పాక్ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో పాక్ ఒకే ఒక మ్యాచ్ (మూడో టీ20) గెలిచింది.

ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కేకేఆర్..
KKR vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(2), హెడ్(4), ఇషాన్ కిషన్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు సాధించగా.. రస్సెల్ రెండు, హర్షిత్ రాణా, నరైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్హెచ్కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన క్లాసెన్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్..7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(14), హర్షల్ పటేల్(1) ఉన్నారు.12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 84/612 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(13), ప్యాట్ కమ్మిన్స్(6) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన నితీశ్ కుమార.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(22), క్లాసెన్(1) ఉన్నారు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లుకష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తడబడుతోంది. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ(2) తీవ్ర నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రింకూ సింగ్(24) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌రఘువన్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రఘువన్షి.. కమిందు మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్(5), రింకూ సింగ్(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్.. రహానే ఔట్‌అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రహానే.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(49), వెంకటేష్ అయ్యర్(1) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రహానే, రఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య రహానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఔట్ కాగా.. రెండో ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్(7) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రహానే(1), రఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్ వచ్చారు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఏసీసీ నూతన చైర్మన్‌గా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కొత్త చైర్మన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. శ్రీలంక క్రికెట్ (SLC) అధిపతి షమ్మీ సిల్వా స్థానంలో నఖ్వీ నియమితులయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన సంస్థ ఖండాంతర సభ్యుల ఆన్లైన్ సమావేశం ద్వారా ACC నాయకత్వ మార్పు నిర్ధారించబడింది. నఖ్వీ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. చైర్మన్ మార్పుకు సంబంధించి ACC నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సమావేశానికి హాజరైన పలువురు సభ్యులు నఖ్వీ ఎన్నికైన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను నిర్వహించడం నఖ్వీ ముందున్న ప్రథమ పరీక్ష. వాస్తవానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు ఉండటం చేత టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం ఆసియా కప్ మీడియా హక్కులను విక్రయించే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్‌ను నిర్వహించే తటస్థ దేశం ఏది అనేది నఖ్వీ నిర్ణయించాల్సి ఉంటుంది. టోర్నీ నిర్వహణ రేసులో యూఏఈ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. శ్రీలంక కూడా పోటీలో ఉంది.

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ మంచి మనసు
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మొదలైదంటే ఈ సారి కప్ నమ్దే అంటూ అభిమానులు చేసే హంగామా ఎంత అంత కాదు. కనీసం 18వ సీజన్లోనైనా తమ ఆరాధ్య జట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్సీబీ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు.అజ్మల్ సుల్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆర్సీబీ జెర్సీ ధరించిన వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తానని ప్రకటించాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి ఉంటే రైడ్ ఫ్రీ అని తన ఆటో వెనక అజ్మల్ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానం అంటే ఇదే నీదేనే అన్నా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఐపీఎల్-2025 సీజన్లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు అందుకున్న బెంగళూరు జట్టు.. బుధవారం తమ సొంతమైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.చదవండి: SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే: భారత మాజీ క్రికెటర్
బిజినెస్

సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్‌లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకం 2025 మార్చి 31 నుంచి నిలిపివేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA).. ఎంఎస్ఎస్సీ పథకం గడువు తరువాత కొనసాగదని అధికారికంగా వెల్లడించింది. కాబట్టి ఇకపై ఈ పథకం కింద కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులకు ఆస్కారం లేదు.మహిళల ఆర్థిక భద్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2023 బడ్జెట్ సమయంలో ఈ ఎంఎస్ఎస్సీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు పొదుపు చేసేందుకు ప్రోత్సాహం లభించింది. ఎంఎస్ఎస్సీ పథకం నిలిపివేయడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్న మహిళలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అయితే, మార్చి 31, 2025లోపు ఎంఎస్ఎస్సీలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం 7.5 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనం ఉంటుంది.ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలుమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మిస్ అయిన వారు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు.

వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాల రేట్లను 0.10 శాతం మేర పెంచుతున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ ఇటీవలే పావు శాతం తగ్గించినప్పటికీ ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్), ట్రెజరీ బిల్లుల ఆధారిత రుణ రేటు (టీబీఎల్ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్), రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఆర్బీఎల్ఆర్)పై బ్యాంక్ అస్సెట్ లయబులిటీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.ఇదీ చదవండి: పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (రెపో ఆధారితం/ఆర్బీఎల్ఆర్)ను 0.10 శాతం పెంచడంతో 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరింది. 6 నెలల నుంచి మూడేళ్లలో కాలం తీరిపోయే రుణాలకు అమలు చేసే టీబీఎల్ఆర్ రేటును 0.05 శాతం తగ్గించడంతో 6.5 శాతానికి దిగొచ్చింది. బేస్ రేటును సైతం 0.05 శాతం తగ్గించగా, 9.80 శాతానికి చేరింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.

ఐటీ షేర్లు పతనం.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలను ప్రకటించడంతో ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ అన్ని యూఎస్ దిగుమతులపై బేస్‌లైన్ 10 శాతం పన్నును కలిగి ఉన్న కొత్త టారిఫ్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. వాణిజ్య మిగులు ఉన్న దేశాలపై అదనపు అధిక సుంకాలను విధించించారు. భారత్ ఇప్పుడు అమెరికా నుంచి 27 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 322.08 పాయింట్లు (0.42 శాతం) క్షీణించి 76,295.36 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 76,493.74 -75,807.55 రేంజ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 82.25 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 23,250.10 వద్ద స్థిరపడింది.టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియడంతో బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ 4.57 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.58 శాతం పెరగడంతో స్మాల్ క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లను మించిపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.21 శాతం నష్టపోగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, టీసీఎస్, ఎంఫాసిస్ సూచీలు నష్టపోయాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలు కూడా తక్కువ పనితీరు కనబరిచాయి.నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.25 శాతానికి పైగా లాభపడటంతో ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకులు, హెల్త్ కేర్, ఎఫ్ ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.94 శాతం వరకు లాభపడ్డాయి.
ఫ్యామిలీ

శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్‌లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్‌లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు

మా ఇంటి మణిదీపం
‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్...‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్‌ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్ వెళుతున్నారు.హాజరు శాతంపెరిగిందిపాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఆర్థిక శక్తిస్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.మా అమ్మమ్మ అలా లాయర్ అయింది...మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో ఎంతైనా సాధించవచ్చునని. – ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మంకలెక్టర్ మా ఇంటికి వచ్చారు!నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్ సార్ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్ చూపించి కలెక్టర్ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. – బానోత్ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం

నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!

ప్రపంచ సమస్యలను-ఆర్ట్‌ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!
ఎన్నో రకాల రెస్టారెంట్ వంటకాలు చూసుంటారు. కానీ ఇలాంటి వంటకాల తీరుని మాత్రం అస్సలు ?చూసుండరు. ఆర్డర్ చేస్తే ఎప్పుడొస్తుందా.. ? అని గంటలతరబడి వెయిట్ చేయాలి. తీరా ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాకా..తినడం మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ రెస్టారెంట్ వడ్డించే తీరు. వంటకాలు లిస్ట్ పెద్దదే..ఆ డెజర్ట్‌లు వడ్డించే తీరు ఊహకు దొరకదు..ప్రశంసకు అందదు అన్నట్లుగా ఉంటాయి ఆ వంటకాలు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..కోపెన్‌హాగన్‌లోని రెఫ్షాలియోన్ జిల్లాలో ఉన్న ఆల్కెమిస్ట్ అనే రెస్టారెంట్లో ఇలా చిత్రమైన రీతీలో వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ రెండు మిచెలిన్ స్టార్లను దక్కించుకుంది. అక్కడ భోజనం ఓ గొప్ప విషయాన్ని బోధిస్తాయి. అందుకోసం అయినా అక్కడకు వెళ్లి తీరాల్సిందే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వంటకాన్ని.. పాకకళకు థియేటర్ అండ్ మల్టీమీడియా ఆర్ట్‌తో మిళితం చేసి.. కస్టమర్లకు సర్వ్ చేస్తుంది. వడ్డించే ప్రతి వంటకం..ఆహార కొరత, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి ప్రపంచ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా క్రియేటివిటీగా అందిస్తారు. అంతేకాదండోయ్ మెనూలో మొత్తం 40 రకాల వంటకాలను అందిస్తుంది. ఆర్డర్ కోసం గంటల తరబడి వెయిట్ చేయక తప్పదు. పైగా ధరలు కూడా కళ్లు చెదిరిపోయే రేంజ్లో ఉంటాయి. ఈ హోటల్లో తినాలంటే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి..ఆర్డర్ కోసం ఎలాంటి వాళ్లైనా.. తప్పక వెయిట్ చేయాల్సిందే. అక్కడ తింటే సుమారు రూ. 60 వేలు పైనే ఖర్చు అవుతుందట. అత్యంత డిమాండ్ ఉన్న ఈ రెస్టారెంట్లో వంటకాలకు సంబధించిన వీడియోని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ నెట్టిట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గతేడాది ఆ రెస్టారెంట్లో అందించిన వంటకాలు కనిపిస్తాయి. తినదగిన సీతాకోక చిలుకల రూపంలో డిజర్ట్ చూస్తే ప్రోటీన్ వనరులుగా కీటకాలును తినొచ్చు అని హైలెట్ చేస్తుంది. ఇంకా పచ్చి జెల్లీ ఫిష్, తినదగిన ప్లాస్టిక్‌లో చుట్టబడిన చేప (సముద్ర కాలుష్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో), సోర్ క్రీంతో చదును చేయబడిన కోడి తల, పాడైనట్లు కనిపించే చీజ్, బోనులో కోడి పాదాలు (ఇది వ్యవసాయం పరిస్థితిని వివరించడం కోసం), పంది, జింక రక్తంలతో చేసిన స్వీట్(రక్తదానం ప్రాముఖ్యత కోసం)..ఇలా ప్రతి వంటకం ఒక్కో ప్రపంచ సమస్యను వివరించేలా అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రెజెంట్ చేశారు. వాటిని చూస్తే మతిపోవడం ఖాయం అనేలా ఉంటాయి. నెటిజన్లు మాత్రం మరీ ఇంత లగ్జరీయస్ గానా..! అని, మరికొందరూ..ఆహారం రూపంలో ప్రపంచ సమస్యలను హైలెట్ చేసేలా కళను కూడా జోడించడం అంటే మాటలు కాదు అని సదరు రెస్టారెంట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Tiff (@greenonionbun)(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)
ఫొటోలు


అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!


రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)


మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)


స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)


కూతురు 'శివియా'తో హీరోయిన్ సంగీత.. వైరల్ ఫోటోలు చూశారా..?


ఖరీదైన అపార్ట్ మెంట్ అమ్మేసిన హీరో షారూక్ భార్య (ఫొటోలు)


Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)


ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)


ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లే భార్యకు సీమంతం (ఫొటోలు)
అంతర్జాతీయం

మృత్యువుతో 108 గంటల పోరాటం
బ్యాంకాక్: భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్ లిన్ టున్ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్ లిన్ టున్ మయన్మార్ రాజధాని నేపడాలోని క్యాపిటల్ సిటీ హోటల్లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్ లిన్ టున్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్‌లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్‌లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్‌ఫోన్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్షిప్లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది.

జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

రష్యాను టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. భయాందోళనలో రష్యన్లు!
మాస్కో: రష్యాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతుచిక్కని వైరస్ కారణంగా రష్యా ప్రజలకు విపరీతమైన దగ్గుతో నోటిలో నుంచి రక్తం పడుతుందనే కథనాల్లో పేర్కొన్నాయి. వీరికి కోవిడ్ టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చిందని.. ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి. మరోవైపు.. ఈ కథనాలను రష్యా అధికారులు ఖండించారు. వైరస్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.వివరాల ప్రకారం.. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని.. కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో.. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. పలు నగరాల్లో ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే, తాము కోవిడ్ టెస్టులు చేపించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిపారు.🦠 Unknown virus emerges in Russia: people suffer from high fever and bloody cough for weeksAccording to media reports, the symptoms of those infected are identical: it begins with typical aches and weakness, but after a few days, the virus drains the person, making it… pic.twitter.com/0tsDsCfLv8— NEXTA (@nexta_tv) March 29, 2025దీంతో, కొత్త వైరస్‌పై తీవ్ర చర్చ మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రష్యా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో సదరు అధికారులు స్పందిస్తూ.. ఈ నివేదికలను ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇక, కొత్త వైరస్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🇷🇺 A mystery outbreak causing patients to cough up blood and suffer from a prolonged high fever has been reported in Russia, sparking fears of a new pandemic. However, Russian authorities have denied claims of an unidentified virus and have not disclosed the number of infections… pic.twitter.com/B03IPo3kPG— 🔴 Press review and more 🛰️ (@EUFreeCitizen) April 1, 2025

ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమెరికాతో చర్చలకు ఇరాన్ రాని పక్షంలో.. ఒకవేళ మంతనాలకు ఇరాన్ వచ్చినా చర్చలు విఫలమయ్యే పక్షంలో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపేందుకు ఇరాన్ భూభాగంపై లక్ష్యాలుగా ఎంచుకునే మూడు కీలక అణు స్థావరాలు.. నతాంజ్, ఫర్దో, ఇస్ఫహాన్. ఒక చోట అని కాకుండా ఇరాన్ గడ్డపై పలు ప్రాంతాల్లో అణు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచివున్న నేపథ్యంలో రక్షణ కోసం కొన్ని అణు స్థావరాలను భూగర్భంలో ఇరాన్ నిర్మించుకుంది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఇరాన్ 2015లో పీ5 (పర్మినెంట్5/ఐరాసలో శాశ్వత సభ్యత్వం గల) దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అణు కార్యక్రమాన్ని చాలావరకు నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాకుండా తమ అణు స్థావరాల్లో అంతర్జాతీయ తనిఖీలను అనుమతించేందుకు అంగీకరించింది. ఒప్పందం అమల్లో ఉన్నా ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేక్ పడలేదన్న కారణంతో ట్రంప్ తొలి హయాంలో 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇదే అదనుగా ఇరాన్ కూడా తమ అణు కార్యక్రమంపై ఆయా దేశాలు విధించిన ఆంక్షలను ఆ మరుసటి ఏడాది నుంచి విస్మరించడం ఆరంభించింది. అలా ఒప్పందం విచ్ఛిన్నమవడంతో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ విస్తరించింది. భారీ అణుశక్తి..2015 నాటి ఒప్పందం అమలైతే ఇరాన్ అణుబాంబు తయారీకి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి కనీసం సంవత్సర కాలం పట్టేది. ఎప్పుడైతే ఒప్పందం విఫలమైందో ఆ వెంటనే యురేనియం శుద్ధిని ఇరాన్ వేగవంతం చేసింది. ఫలితంగా వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తి కాలాన్ని ఏడాది నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వ్యవధికి ఇరాన్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇరాన్ ప్రస్తుతం రెండు ప్రదేశాల్లో యురేనియంను 60% ఫిజైల్ ప్యూరిటీ వరకు శుద్ధి చేస్తోంది. దీని అర్థం 90% వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఇరాన్ చేరువైనట్టే. శుద్ధితో యురేనియం స్వచ్ఛత పెరిగేకొద్దీ కేంద్రక విచ్ఛిత్తి (విస్ఫోటన) సామర్థ్యం అధికమవుతుంది. సైద్ధాంతికంగా చూస్తే.. యురేనియం శుద్ధిని మరింత కొనసాగిస్తే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న యురేనియంతో ఆరు అణుబాంబులు రెడీ అవుతాయి!.నతాంజ్.. భూగర్భంలో మూడంతస్తులు! రాజధాని టెహ్రాన్ నగరానికి దక్షిణంగా నతాంజ్ వద్ద భూగర్భంలో ఒకటి (ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్), భూమి ఉపరితలంపై ఒకటి (పైలట్ ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్) చొప్పున రెండు యురేనియం శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో భూగర్భ ప్లాంటులో ప్రస్తుతం 16 వేల సెంట్రీఫ్యూజెస్ ఉండగా 13 వేల సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. ఇవి యురేనియంను 5% స్వచ్ఛత వరకు శుద్ధి చేస్తున్నాయి. భూగర్భంలో మూడు అంతస్తుల్లో ఈ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ భూగర్భ స్థావరాన్ని ఎంతవరకు నాశనం చేయగలవనేది ప్రశ్నార్థకం. ఇక భూ ఉపరితలంపై ఉన్న ప్లాంటులో వందల సెంట్రీఫ్యూజెస్ మాత్రమే ఉన్నప్పటికీ 60% స్వచ్ఛత వరకు యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోంది. ఏమిటీ సెంట్రీఫ్యూజెస్? యురేనియం శుద్ధి ప్రక్రియలో సెంట్రీఫ్యూజెస్ పాత్ర కీలకం. సహజ యురేనియంలో యురేనియం-238 అధికంగా, యురేనియం-235 స్వల్పంగా (0.7%) ఉంటాయి. అణు ఇంధనం తయారీకి ఎక్కువ గాఢతతో కూడిన యురేనియం-235 కావాలి. యురేనియం-238 నుంచి యురేనియం-235ను వేరుచేయడానికి అపకేంద్ర బలాన్ని సెంట్రీఫ్యూజెస్ ఉపయోగించుకుంటాయి. సెంట్రీఫ్యూజెస్ నిమిషానికి 50 వేల రౌండ్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో భార అణువులు కేంద్రానికి దూరంగా తోసివేయబడితే, తేలికపాటి అణువులు కేంద్రానికి దగ్గరగా వస్తాయి. యురేనియంను వాయువు (యూఎఫ్6)గా మార్చి వేగంగా తిరిగే సిలిండర్ల (సెంట్రీఫ్యూజెస్)లోకి పంపుతారు. అధిక సాంద్రతతో కూడిన యురేనియం-238 గల భార యూఎఫ్6 అణువులు ఆ సిలిండర్ల వెలుపలి అంచుల వద్దకు, అల్ప సాంద్రతతో కూడిన యురేనియం-235 గల తేలికపాటి యూఎఫ్6 అణువులు కేంద్రం వద్దకు చేరతాయి. అలా యురేనియం-235ను వేరుచేసి తర్వాత దశకు పంపుతారు. బాగా శుద్ధి అయిన (హైలీ ఎన్రిచ్ద్) యురేనియంను అణ్వాయుధాల తయారీలోనూ, అల్ప శుద్ధి (లో ఎన్రిచ్ద్) యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగిస్తారు. Telegraph: Current US bombs not enough to penetrate Iran's nuclear facilities!The American B-2 bomber can penetrate to a depth of 61 meters, but the Natanz and Fordow nuclear facilities in Iran are built at a depth of 80 to 100 meters.In addition, Iran's facilities are… pic.twitter.com/lcDi8GMKAN— Sprinter Observer (@SprinterObserve) December 24, 2024ఫర్దో.. పర్వతగర్భంలో! భద్రత పరంగా నతాంజ్ భూగర్భ ప్లాంటు కంటే ఫర్దోలోని యురేనియం శుద్ధి కేంద్రం ఉత్తమమైనది. ఎందుకంటే దీన్ని పర్వతాన్ని తొలిచి నిర్మించారు. ఇక్కడ రెండు వేల దాకా సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మూడో తరానికి చెందిన అత్యాధునిక ఐఆర్-6 సెంట్రీఫ్యూజ్ యంత్రాలను వినియోగిస్తుండటం విశేషం. ఇస్ఫహాన్.. శుద్ధి చేసిన యురేనియం నిల్వ! దేశంలో రెండో అతి పెద్ద నగరం ఇస్ఫహాన్. ఇరాన్ ఇక్కడ భారీ న్యూక్లియర్ టెక్నాలజీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఫ్యూయెల్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలో యురేనియంను ‘యురేనియం హెక్సాఫ్లోరైడ్ (యూఎఫ్6)గా మార్చి సెంట్రీఫ్యూజెస్ యంత్రాల్లోకి పంపుతారు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఇక్కడే నిల్వ చేస్తుంది.-జమ్ముల శ్రీకాంత్.Natanz for uranium enrichment. Underground enrichment facility of this center is protected by a concrete shield with a thickness of approximately 7.6 meters📍33°43'29.8"N 51°43'33.9" pic.twitter.com/jHffMnchWE— 𝓂𝒶𝓇𝒾𝑜🇱🇧🇬🇧🇦🇪 (@MarioLeb79) March 31, 2025
జాతీయం

ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ప్రసాద్ వీపు, చేతులపై పుండ్లు పడినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఆయన్ని కార్డియో క్రిటికల్ కేర్ యూనిట్(CCU)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లాలూ వెంట ఆయన సతీమణి రబ్రీదేవి ఉన్నారు. వాస్తవానికి.. బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కసారిగా రక్తపోటులో తేడా కనిపించింది. దీంతో వెంటనే పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న అనంతరం ఢిల్లీ తరలించారు.లాలూ ఆరోగ్యంపై ఆయన తనయుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. పరాస్ ఆసుపత్రి నుంచి లాలూను తొలుత ఎయిర్ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రయాణికుల విమానంలో వెళ్తానని చెప్పడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని తేజస్వి అంటున్నారు. 76 ఏళ్ల చాలా ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతుండడంతో ఇప్పటికే గుండె, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గత ఏడాది జూలైలో ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు.

మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
గాంధీ నగర్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్ నగర్లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్‌ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Tragic news tonight. Trainee IAF fighter pilot killed in Jaguar crash near Jamnagar. The other pilot managed to eject, being treated in hospital.Deepest condolences to the family of the deceased pilot. 💔 pic.twitter.com/bQy6bG1918— Shiv Aroor (@ShivAroor) April 2, 2025 An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…— Indian Air Force (@IAF_MCC) April 3, 2025
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
రంగారెడ్డి జిల్లా : సంచలనం సృష్టించిన విదేశీ యువతిపై అత్యాచార ఘటనలో రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నిందితుడు మహ్మద్ అస్లాంను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేవలం గంట రెండుగంటల వ్యవధిలోనే నిందితుడు యువతితో పాటు ఆమె స్నేహితుడిని అంతగా ఎలా నమ్మించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడికి ఆంగ్లంపై పట్టుండటంతో చలాకీగా మాట్లాడి ఆకర్షించాడా.. వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు.. గతంలో కూడా ఇదే తరహా ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అస్లాం ఇలాంటి ఘటనకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజిటింగ్ వీసాపై జర్మనీ నుంచి వచ్చిన యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు భారత్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు నివేదికను పంపనున్నారు. ఇదిలా ఉండగా, మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న ఆ యువతి గురువారం అర్ధరాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లనుంది.

ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
హైదరాబాద్: సికింద్రాబాద్–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Ambati Rambabu: నారా లోకేష్ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలి


వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP


విశాఖలో తీవ్ర విషాదం


ఎన్ఆన్ఐలకు చెందిన స్థలాలపై కబ్జారాయుళ్ల దృష్టి


విజయ్ దేవరకొండ సినిమాపై నాగవంశీ కామెంట్స్


IPL : సిరాజ్ పగ కోహ్లి ఫ్యూజులౌట్


కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే


Prakash Raj: పవన్ సనాతన వేషం వెనుక రహస్యం


హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం


రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు