
కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని, జిల్లాలో వచ్చే నెల 13వరకు ని ర్వహించే జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా స్పర్శ్‌పై ప్రజలకు అవగాహ న కల్పించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్‌నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభు త్వ ఆసుపత్రుల పరిధిలోని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రజలకు కుష్ఠువ్యాధి పై అవగాహన కల్పిస్తామని అన్నారు. రోగుల ను గుర్తించి వైద్యం అందిస్తామని, 2027 నాటికి కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామ ని అన్నారు. సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, నాందేవ్, డీపీఎం ప్రశాంతి, స్వామి, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, డీపీఎంవో రాఘవయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment