మాస్టర్‌ప్లాన్‌కు నిధులివ్వండి..
– మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలలో మాస్టర్‌ప్లాన్ అమలుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టామని, అందుకు రూ.78కోట్లు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.12కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. మంచిర్యాలను కార్పొరేషన్‌గా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో నాలుగు ఎకరాల్లో రూ.11 కోట్లతో గ్రీన్‌క్రిమిటోరియం పద్ధతిలో శ్మశానవాటిక నిర్మిస్తున్నామని, దీనిలో పూర్తిగా సోలార్ పవర్ వాడే విధంగా చర్యలు తీసుకున్నామని, పూర్తి కావొచ్చిందని తెలిపారు. కరకట్ట నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతాశిశు కేంద్రం ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని, ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment