ఆయుర్వేదిక్ మొక్కలను సంరక్షించాలి
జన్నారం: అడవిలో ఉండే రకరకాలైన ఆయుర్వేదిక్ మొక్కలు, వాటి ఉపయోగాలను తెలుసుకుని సంరక్షించాలని ఇందన్‌పల్లి అటవీ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ అన్నారు. సోమవారం రేంజ్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్, సోనాపూర్ బీట్‌లో సిబ్బందితో కలిసి పర్యటించారు. నీటి వనరు, సోలార్‌పంపు సమీపంలో పెరిగిన గడ్డిలో ఆయుర్వేదిక్ మొక్కలను పరిశీలించారు. ఆయుర్వేదిక్ మొక్కలను గుర్తించి సిబ్బందికి వాటి గురించి తెలియజేశారు. కొన్ని రకాల ఆయుర్వేదిక్ మొక్కలు తినడం ద్వారా వన్యప్రాణులు ఆరోగ్యకరంగా ఉంటాయని తెలిపారు. ఆయుర్వేదిక్ మొక్కలు పలు రకాల వ్యాధుల నివారణకు వాడవచ్చని, అలాంటి ఉపయోగకరమైన మొక్కలను గుర్తించి వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. సోలార్ పంపుల ప్రాంతాల్లో గడ్డి పంపకంపై దృష్టి పెట్టాలని అన్నారు. సెక్షన్ అధికారులు హన్మంతరావు, రవి, బీట్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment