ఎన్నికల రోజు సెలవు ఇవ్వాలి
శ్రీరాంపూర్: ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఈ నెల 27న సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు ఇ వ్వాలని బీఎంఎస్ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆ యూ నియన్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జీఎం కార్యాలయంలో ఎస్ ఓటు జీఎం యన్.సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల నిబంధన ప్రకా రం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని తెలిపారు. సింగరేణిలో అనేకమంది పట్టభద్రులు ఉన్నారని, వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూని యన్ బ్రాంచీ కార్యదర్శి రాగం రాజేందర్, బీజే పీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సత్రం రమే శ్, నాయకులు కట్కూరి సతీశ్, కాంపెల్లి తిరుప తి, కిషన్, సతీశ్, కలవేన స్వామి, నీరటీ సు రేశ్, అటికపురం తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment