● నస్పూర్‌లోని మైదానంలో ఏర్పాటు ● వేలాదిగా తరలివచ్చిన ప
నస్పూర్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంకల్పసభ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా పట్టభద్రులు హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని అన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం ప్రకటించడంతో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ సభలో మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కంటోన్మెంట్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర కనీస వేతన సవరణ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చా ర్జీలు శ్యాంనాయక్, అడె గజేందర్, కంది శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నరు: సీఎం
‘మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులు. మీరు ఒక్క ఓటు వేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటే మీకు ఇద్దరు సేవకులు వచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు రోజుకు 16గంటలు పని చేస్తే, డీసీసీ అధ్యక్షురాలిగా సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment