మలేషియా జైలులో కడెం వాసులు
కడెం: మండలంలోని లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. కొన్ని కారణాల వలన జైలులో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కలిసి విడుదల చేయించాలని వేడుకున్నారు. మలేషియా వెళ్లి ఉన్నతాధికారులను సంప్రదించాడు. అక్రమ ఆయుధ చట్టం కింద జైలులో ఉన్నారని తెలుసుకుని బాధితులను పరామర్శించాడు. విడుదల చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment