విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

Published Thu, Mar 6 2025 1:40 AM | Last Updated on Thu, Mar 6 2025 1:37 AM

విద్య

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

సిరికొండ: విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తుమ్మల్‌పాడ్‌ గ్రామానికి చెందిన ఇంగోలే నాగోరావ్‌, కుసుంబాయి దంపతుల రెండో కుమారుడు ఇంగోలే విలాస్‌ (24)బుధవారం ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్‌ వైరుకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇచ్చోడ ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుడు ఆరునెలల క్రితమే దుబాయ్‌ నుంచి ఇంటికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

స్వగ్రామం చేరిన మృతదేహం

లక్సెట్టిపేట: గత నెల 27న ఓమన్‌లో మృతి చెందిన వలస కూలీ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఉపాధి నిమిత్తం రెండేళ్లక్రితం ఓమన్‌ దేశానికి వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో పనిచేస్తుండగా అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించా రు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వృద్ధుడు ఆత్మహత్య

దండేపల్లి: గడ్డిమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వెల్గనూర్‌కు చెందిన అక్కల మల్లేశం (79) కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందడంతో ఈనెల 4న గడ్డిమందు తాగి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు రెఫర్‌ చేయగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమార్తె రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

అధికారి ఇంట్లో చోరీకి యత్నం

భైంసాటౌన్‌: పట్టణంలోని సాయికాటన్‌ ఏరియాలో ఉంటున్న ఆర్‌అండ్‌బీ డీఈఈ సునీల్‌ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి వి ఫలయత్నం చేశారు. సాయికాటన్‌లోని ఓ ఇంట్లో అ ద్దెకు ఉంటున్న భైంసా ఆర్‌అండ్‌బీ డీఈఈ సునీల్‌ మంగళవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవా రం ఇంటి తాళం తెరిచి ఉండడం గమనించిన స్థా నికుల సమాచారంతో అతను వచ్చి పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేవని చెప్పారు.

అడవి పందుల దాడిలో ఇద్దరికి గాయాలు

పెంబి: మండలంలోని సిక్కిగూడ గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్‌, సిడాం తుకారాం మంగళవారం రాత్రి షెట్‌పల్లి సమీపంలో ఉన్న చేనుకు కాపలాగా వెళ్తుండగా అడవి పందులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి1
1/1

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement