స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
● టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, పా ర్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశా రు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్థలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment