● గుడిహత్నూర్ వాసులకు గాయాలు
గుడిహత్నూర్: మహారాష్ట్రలో ట్రాలీ వాహనం బోల్తా పడిన ఘటనలో మండలానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్ రాజు మంగళవారం 16 మంది బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనానికి మహారాష్ట్రంలోని చంద్రపూర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోర్పణ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో రాజుతో పాటు అతని తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీష్, నాందేడ్‌కు చెందిన మహిళ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా రిమ్స్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సీతాబాయిని హైదరాబాద్‌కు, అత్త, మేనకోడలిని నాందేడ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గెడం జగదీష్‌తో పాటు పలువురు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని కోర్పణ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment