లింగనిర్ధారణ పరీక్షలు చేయొద్దు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని, చేసినట్లు రుజువైతే చట్ట ప్రకారంగా చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ హెచ్చరించారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల తనిఖీలను బుధవారం ప్రా రంభించారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ స్కా నింగ్ కేంద్రాన్ని డీఎంహెచ్‌వో పరిశీలించి సూ చనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామని తెలి పారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment