మూడో యూనిట్ పనులకు సిద్ధంగా ఉండాలి
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా మూడో యూనిట్(800 మెగా వాట్లు) ప్లాంటు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) డి.సత్యనారాయణరావు అన్నా రు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును సందర్శించారు. ప్లాంటు నిర్మాణ స్థలం పరిశీలించి పైలా న్ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. 1200మెగావాట్ల బీటీజీ ఏరియాలో బాయిలర్స్ పరిశీలించి విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకతను గమనించి ప్లాంటు నిర్వహణలో లోపాలు లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. సాయంత్రం ఎస్టీపీపీ ఓపెన్ అడిటోరియంలో ఇటీవల ఫైనాన్స్ జీఎంగా పని చేసి పదవీ విరమణ పొందిన టి.సుధాకర్‌ను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈడీ శ్రీనివాసులు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏజీఎంలు ప్రసాద్, వేణుగోపాలరావు, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు, సముద్రాల శ్రీనివాస్, ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment