బాలికల వసతిగృహంలో బీసీ వెల్ఫేర్ అధికారి బస
జైపూర్: మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహంలో మంగళవారం రాత్రి జిల్లా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి భాగ్యవతి బస చేశారు. విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వసతిగృహా పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. అ నంతరం 10వ తరగతి విద్యార్థులకు వార్షిక ప రీక్షలపై అవగాహన కల్పించారు. ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతతో చదవాలని, ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకుని ఎక్కువగా రివిజన్ చేస్తే ఉత్తీర్ణతతోపాటు మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వసతిగృహా సంక్షేమాధికారి సుధాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment