వంతెనపై నుంచి పడి వ్యక్తి..
సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్‌పేట్ సమీపంలో పోడ్సా అంతర్రాష్ట్ర వంతెన పై నుంచి పడి వ్యక్తి కిందపడి మృతిచెందాడు. సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం విలేజ్ నెంబర్ 12కు చెందిన ప్రశాంత్ సనా (31) వ్యాపారం నిమిత్తం బైక్‌పై బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వస్తున్నాడు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఉన్న పోడ్సా అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు మృతుడి సోదరుడు ప్రమోతో సనా సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతుడు ప్రశాంత్ సనాగా గుర్తించాడు. సోదరుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment