అంతర్జాతీయ కళా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లావాసి ప్రతిభ
ఆదిలాబాద్‌టౌన్: దేశంలోని కళాకారులు, ఐదు దేశాలకు పైగా ఎన్‌ఆర్‌ఐల మ ధ్య నిర్వహించిన సె షన్ 16వ అంతర్జాతీ య కళాపోటీల్లో పట్టణంలోని టీచర్స్‌కాలనీకి చెందిన గాధరి చంద్రశేఖర్ ప్రతిభ కనబర్చాడు. ఇన్నోవిజే గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ర్యాంక్ స్లాట్ ప్రకారం ఐఏసీ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్ విభా గంలో ది మెడల్ ఆఫ్ అప్రిషియేషన్‌తోపాటు ది లెటర్ ఆఫ్ రికగ్నిషన్ లెవల్–2లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నా డు. అర్హులైన కళాకారుల్లో ఒకరిగా పేరు సాధించుకున్నాడు. అవార్డు అందుకున్న ఆయన్ను బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
గోదావరికి సప్తహారతి
బాసర: బాసర గోదావరినది పుష్కరఘాట్‌లో శ్రీవేద భారతీపీఠం వ్యవస్థాపకుడు వేద విద్యా నందగిరిస్వామి ఆధ్వర్యంలో సప్తహారతి అందించారు.గంగాహారతి ప్రారంభించి గురువా రం నాటికి 2,676వ రోజు పూర్తి చేసుకుంది. ప్ర తీరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు గోదారమ్మతల్లికి పూజలు నిర్వహిస్తారు. భక్తులు పాల్గొనాలని విద్యానందగిరిస్వామి కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని చున్నంబట్టి సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.సీఐ ప్రమోద్‌రావు కథన ం ప్రకారం.. హాజీపూర్ మండలం ముల్క ల్లకు చెందిన శెటపల్లి నరేశ్..జిల్లాకేంద్రంలోని మెడికల్ కాలేజీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కాలేజీకి గురువారం బైక్‌పై వెళ్తుండగా సీసీసీ వైపు నుంచి మంచిర్యాలకు వస్తున్న లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరేశ్ మామ రాజయ్య ఫిర్యాదుతో లారీ డ్రైవర్ నర్సింహరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
హోంగార్డు, మిత్రుడిపై కేసు
నిర్మల్‌టౌన్: ఓ వ్యక్తిని భయపెట్టి అతని వద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్ తీసుకున్న హోంగా ర్డు, ఆయన మిత్రుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మామడ మండలం కమల్‌కోట్‌కు చెందిన పత్తిరి రాజేశ్వర్ చికిత్స కోసం గురువారం జిల్లాకేంద్రంలోని ఓ హాస్పిటల్‌కు వచ్చాడు. అక్కడ ఓ మహిళ తన బంధువులతో మాట్లాడుతానంటూ రాజేశ్వర్ వద్ద నుంచి ఫోన్ తీసుకుని వెళ్లిపోయింది. గమనించిన హోంగార్డు సంజీవ్, అతని మిత్రుడు తి రుపతి ఇద్దరు పథకం ప్రకారం.. రాజేశ్వర్ వద్ద కు వెళ్లారు. తమ మిత్రుడు భార్యకు ఎందుకు ఫోన్ చేసి వేధిస్తున్నావని భయపెట్టి, రూ.5 వేలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. రాజేశ్వర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అంతర్జాతీయ కళా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లావాసి ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment