భైంసాలో మూడిళ్లలో చోరీ
● ఓ బైక్‌ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దొంగ
భైంసాటౌన్: పట్టణంలోని గోకుల్‌నగర్‌లో తాళాలు వేసి ఉన్న మూడిళ్లలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలోని సాయిచరణ్‌రెడ్డి, రాహుల్ బుధవారం వారి ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం వెళ్లగా, అదే కాలనీలో ఐలాజిక్ కంప్యూటర్ సెంటర్‌కు తాళం వేసి ఉంది. దీంతో గుర్తు తెలియని దొంగ ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. బాధితులు గురువారం ఉదయం చేరుకుని చూడగా వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. సాయిచరణ్‌రెడ్డి ఇంట్లో రూ.20వేల విలువైన ఆభరణాలు, రాహుల్ ఇంట్లో రూ.లక్ష వరకు నగదు, ఆభరణాలు, ఐలాజిక్ కంప్యూటర్ కేంద్రంలో ఓ బ్లాంక్ చెక్కు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. అలాగే ఇదే కాలనీలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ సైతం ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ గోపినాథ్ వెల్లడించారు. నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment