వరకట్న వేధింపులకు వివాహిత బలి
● ఈనెల 4న పురుగుల మందు తాగి.. ● చికిత్స పొందుతూ మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): అత్తింటివారి అదనపు కట్న వేధింపులు భరించలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హాజీపూర్ ఎస్సై గోపతి సురేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లి గ్రామానికి చెందిన లావణ్య (23) 2020 ఫిబ్రవరి 15న హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన మాడ శంకర్‌రెడ్డితో వివాహమైంది. పెళ్లయిన మూడునెలల తర్వాత భర్త, అతని తల్లిదండ్రులు లక్ష్మి–జనార్దన్‌రెడ్డిలు అదనపు వరకట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇరువురి మధ్య సఖ్యత ఏర్పడి కాపురం చేయసాగారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినప్పటికీ భర్త, అతని తల్లిదండ్రులు అదనపు వరకట్నం తేవాలని వేధించసాగారు. లావణ్య భరించలేక ఈనెల 4న గుర్తుతెలియని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారు. చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment