● స్పష్టం చేసిన శాంతిఖని ప్రభావిత గ్రామాల ప్రజలు ● పునః
హామీలు నెరవేర్చాలి
గతంలో ప్రభావిత గ్రా మాల ప్రజలకు ఇచ్చిన హామీలను సింగరేణి అధికారులు నెరవేర్చాలి. గ్రా మాల అభివృద్ధికి పాటుపడాలి. బొగ్గు వనరులు ఉన్నచోటే త వ్వకాలు చేపట్టడం జరుగుతుంది. శాంతిఖ ని లాంగ్‌వాల్ ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియరెన్స్ ఇవ్వాలి.
– కాంపల్లి సమ్మయ్య,
ఐఎన్టీయూసీ నాయకుడు
సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు, సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులు ప్రభావిత గ్రామాల్లో ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటాం. గాలి, నీరు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడుతాం. బెల్లంపల్లి ప్రజలకు నీటి సౌకర్యం అందిస్తాం. పంటల సాగు కోసం చెరువుల్లోకి నీటిని మళ్లిస్తాం. భూగర్భ జలాల సంరక్షణకు పాటుపడతాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇప్పిస్తాం.
– జి.దేవేందర్, జీఎం, మందమర్రి ఏరియా
బెల్లంపల్లి: భూగర్భ జలాలను నిర్వీర్యం చేసి పంటల సాగుకు విఘాతం కలిగించే శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టు వద్దని, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు పునఃధ్రువీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని ప్రభావిత గ్రా మాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. గురువారం ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత శాంతిఖని గని కార్యాలయ ఆవరణలో పోలీసు, ఎస్ అండ్‌పీసీ, ఎస్టేట్ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య శాంతిఖని లాంగ్‌వాల్ భూగర్భ బొగ్గుగని ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎస్.మోతీలాల్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ముందుగా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ ప్రభావిత గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం సింగరేణి వ్యయం చేసిన డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధుల వ్యయం వివరాలను ప్రకటించారు. ఆ తర్వాత అభిప్రాయ సేకరణ జరగగా ప్రాజెక్టును ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు, యువకులు, రిటైర్డు కార్మికులు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టు వల్ల గ్రామీణులకు ఒరిగేదేం లేదన్నారు. సింగరేణి అధికారుల మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయామని, ఇకపై నమ్మబోమని స్పష్టం చేశారు. బట్వాన్‌పల్లిలో 2004లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సింగరేణి అధికారులు ఇచ్చిన హామీల్లో నేటికీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 500 నుంచి 700 మీటర్ల దిగువలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి లాంగ్‌వాల్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం వల్ల భూగర్భంలో నీటి వనరులు మరింతగా అడుగంటి పోతాయన్నారు. ఇప్పటికే బోర్లలో సరిపడా నీళ్లు లేక వట్టి పోతుండగా, పంటల సాగుకు నానాయాతన పడుతున్నామన్నారు. ప్రాజెక్టు విస్తరణకు అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టును రెన్యూవల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓపెన్‌కాస్ట్ చేస్తారనే ప్రజల్లో కలిగిన అపోహలను నివృత్తి చేసి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సింగరేణి అధికారులకు సూచించారు. సింగరేణి డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులు ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాంగ్‌వాల్ ప్రాజెక్టు నిర్వహణకు మద్దతు తెలుపుతున్నట్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, బీఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో గ్యాలరీలో కూర్చున్న యువకులు, నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి ప్రసంగానికి అడ్డుపడ్డారు.
ర్యాలీగా తరలివచ్చిన గ్రామీణులు
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభావిత పాత బెల్లంపల్లి, ఆకెనపల్లి, లింగాపూర్, బుచ్చయ్యపల్లి, పెర్కపల్లి, బట్వాన్‌పల్లి గ్రామాల యువకులు, రైతులు, రిటైర్డు కార్మికులు, ప్రజలు ర్యాలీగా తరలి వచ్చారు. వీరిని తనిఖీ చేసిన తర్వాత సభాస్థలిలోకి పంపారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు పహారా కాశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ శాఖ జీఎం బి.సైదులు, మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
● స్పష్టం చేసిన శాంతిఖని ప్రభావిత గ్రామాల ప్రజలు ● పునః
● స్పష్టం చేసిన శాంతిఖని ప్రభావిత గ్రామాల ప్రజలు ● పునః
● స్పష్టం చేసిన శాంతిఖని ప్రభావిత గ్రామాల ప్రజలు ● పునః
Comments
Please login to add a commentAdd a comment