‘పది’ ప్రీఫైనల్ పరీక్షలు షురూ
మంచిర్యాలఅర్బన్: పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రీఫైనల్ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రారంభమయ్యాయి. వందశాతం ఫలితాలే లక్ష్యంగా పది విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 వరకు నిర్వహించిన పరీక్షలకు జిల్లాలోని 246 పాఠశాలలకు చెందిన 9,489 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి రోజు ఫస్ట్‌లాంగ్వేజ్ పరీక్ష ని ర్వహించగా 7న సెకండ్ లాంగ్వేజ్, 10న ఇంగ్లి ష్, 11న గణితం, 12న ఫిజికల్ సైన్స్, 13న బ యెలాజికల్ సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. వార్షిక పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నా రు. కొన్ని పాఠశాలల్లో బెంచీకి ఒకరు చొప్పు న మాత్రమే విద్యార్థులను అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment