● సీఐడీ విభాగానికి ఎం.శ్రీనివాస్ బదిలీ
మంచిరాల్యక్రైం: రామగుండం పోలీసు కమిషనర్(సీపీ) ఎం.శ్రీనివాస్ సీఐడీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ పోలీసు కమిషనర్ 2009బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ 2024 ఫిబ్రవరి 14న రామగుండం సీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర జిల్లాల పోలీసు అధికారులతో తరచూ సమావేశం అయ్యారు. మావోయిస్టుల కదలికలు కనిపెట్టేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడ పట్టేందుకు వీలుగా డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. మావోయిస్టుల గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. గంజాయి, పేకాట, రేషన్‌బియ్యం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. రౌడీషీటర్లలో మార్పుకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా..
రామగుండం సీపీగా నియామకం అయిన అంబర్ కిషోర్ ఝా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎస్పీగా పని చేశారు. ఆయనకు సౌమ్యుడి పేరుంది. ఐపీఎస్ తర్వాత మొదటి పోస్టింగ్ ఉమ్మడి జిల్లాలో ఏఎస్పీగా 2012లో కొంతకాలం పని చే శారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా పని చేశారు. 2018లో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వర్తించా రు. ఉమ్మడి జిల్లాలో ఏఎస్పీగా పని చేసిన ఆయనకు మంచిర్యాల జిల్లాపై కొంత అవగాహన ఉంది.
ఐపీఎస్ హోదాలో డీసీపీగా భాస్కర్
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌కు ఐపీఎస్ హో దాలో పోస్టింగ్ ఇస్తూ ఇక్కడే నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఆయన గ్రూప్–1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు. నాన్ క్యాడర్ డీసీపీగా 2024 జూన్ 20న మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు 14న స్టేట్ సర్వీస్ పూర్తి చేసుకోగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐపీఎస్ హోదా కల్పించింది. అనంతరం పోస్టింగ్ లేకపోవడంతో మంచిర్యాల డీసీపీగా అటాచ్డ్ చేశారు. ప్రస్తుతం ఐపీఎస్ హోదాలో డీసీపీగా బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment