మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ కాలనీలో గోబార్‌గ్యాస్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా ఫైర్ అధికారి భగవన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఎస్‌కేజీఎస్ సంగ్ సంస్థ ఏసీసీ కాలనీలో ఒక క్వార్టర్‌ను అద్దెకు తీసుకుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ఎంపిక చేసి రూరల్ డెవలప్‌మెంట్ వర్క్ కింద ఉచితంగా (బయో) గోబార్ గ్యాస్ అందిస్తోంది. గ్యాస్ నిర్మాణంలో వాడేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు, కప్పులు గోదాంలో నిల్వ ఉంచారు. శుక్రవారం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50వేల విలువ చేసే ప్లాస్టిక్ కప్పులు, పైపులు దగ్ధమయ్యాయి. కాగా గోబర్ గ్యాస్ ఉచితంగా అందజేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక ఫైర్ అధికారి రమేశ్‌బాబు, లీడింగ్ ఫైర్‌మెన్ అరుణ్‌కుమార్, డ్రైవర్ ఎంఏ రహీమ్, ఫైర్ మెన్ రాజేందర్, రమేశ్, శ్యాంసుందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment