వారబందీ.. ఇబ్బంది!
● సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు ● నాలుగు తడుల్లో రెండు తడులే అందాయి.. ● పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన
దండేపల్లి: కడెం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో అందించే సా గునీరు సక్రమంగా అందడం లేదంటూ మండలంలోని నాగసముద్రం మూలమలుపు వద్ద కడెం ఆయకట్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ–22, 23, 24 కాలువల ఆయక ట్టు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. తాళ్లపే ట, నాగసముద్రం, మాకులపేట గ్రామాల రైతులు పలువురు మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు నీటిని వారబందీ పద్ధతిలో డిస్ట్రిబ్యూటరీ–28 వరకు అందిస్తామని చెప్పారని, మొక్కజొన్న, వరి తదితర పంటలు సాగు చేసుకున్నామని తెలి పారు. ఇటివరకు నాలుగు తడులు వచ్చాయ ని, ఇందులో రెండు మాత్ర మే సక్రమంగా ఇ చ్చారని, మూడో తడి నుంచి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదో తడి రావాల్సి ఉన్నా ఇంతవరకు రాలేదని తెలిపారు. నాలుగో తడి సక్రమంగా అందలేదని పది రోజుల క్రితం ప్రధాన కాలువలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు ఐదో తడి విషయంలో నిర్లక్ష్యం చేయడంతో రోడ్డెక్కారు. అధికారులు సాగునీరందిస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్సై తహసీనొద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment