శ్రామిక మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం
● ఐఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కామిల్ల జయరావు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రామిక మహిళలకు రక్షణ కలిపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కామిల్ల జయరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఆర్‌టీయూ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం హాజీపూర్ మండలం ముల్కల్ల ఇటుక బట్టీల వద్ద మహిళా కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఇటుక బట్టీ కార్మికులు లక్ష్మీ, మదునక్క, పద్మ, వెంకటమ్మ, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment