షార్ట్ సర్క్యూట్‌తో మూడిళ్లు దగ్ధం
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని ఆడదస్నాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మూడిళ్లు దగ్ధమైంది. ఇంట్లో నిత్యావసరాలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ధరవత్ బలరాం, నాందేవ్ జమిందార్ ఇళ్లపై నుంచి విద్యుత్ వైర్లు ఉండగా రాత్రి సమయంలో గాలికి ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలో గడ్డి వాముపై నిప్పు పడటంతో ఇళ్లకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో ఓ ఎద్దు మృతిచెందింది. రెండు ఎడ్లకు గాయాలయ్యాయి. సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్ శనివారం దగ్ధమైన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment