● పంట రక్షణకు వెళ్లి..విద్యుత్ తీగలకు తగిలి రైతు మృతి
కంచె ప్రాణం తీసింది●
తానూరు: విద్యుత్ కంచె ఓ రైతు ప్రాణం తీసింది. అడవి జంతువుల బారి నుంచి పంట రక్షణ కోసం వెళ్లి కరెంట్ తీగలకు తగిలి మృతిచెందాడు. మండలంలోని మహలింగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై శ్యాముల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తురాఠి గంగాధర్ (60) వ్యవసాయం చేస్తుంటాడు. అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించేందుకు విద్యుత్ కంచె తీగలు ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం చేనులో పంట రక్షణ కోసం వెళ్తున్నానని కుటుంబీకులకు చెప్పి బయల్దేరాడు. రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. శనివారం ఉదయం వారు చేనులో వెళ్లి చూసేసరికి విద్యుత్ కంచె తీగలకు తగలి విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య గంగామణి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment