అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నర్సాపూర్(జి): అప్పుల బాధతో రైతు ఉరేసుకుని ఆ త్మహత్యకు పాల్ప డ్డాడు. మండలంలో ని గొల్లమాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఎండీ.జలాలుద్దీన్ కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన రైతు నీరటి గంగాధర్ (44) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత రెండేళ్లుగా పంట సాగుచేస్తున్నాడు. సరైన దిగుబడి రాలేదు. పంట పె ట్టుబడి కోసం ఇతరుల వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లిస్తాననో లే దో అని మనస్తాపం చెంది శనివారం గ్రామ శివారులోని వేపచెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య సవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment