జీవో 3ను పునరుద్ధరించాలి
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం జీవో 3ను పునరుద్ధరించి ఆదివాసీలకు ఉద్యోగాలు దక్కేలా చూడాలని టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. బెంగుళూర్‌లో నిర్వహిస్తున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాల్లో ఆయన రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. జీవో 3ను పునరుద్ధరణ చేసే అధికారం, అవకాశం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా కేంద్రం స్పందించి 5వ షెడ్యూల్‌లో ఆదివాసీ యువతకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment