సింగరేణి ఉద్యోగం చేస్తూ..
రెబ్బెన(ఆసిఫాబాద్): డిగ్రీ పూర్తి కాగానే సాఫ్ట్‌వేర్ వైపు విప్రోలో ఉద్యోగం సాధించా. కానీ ఎప్పుడూ కంప్యూటర్‌తోనే ఉండాల్సి వచ్చేది. ఎక్కడో చిన్న వెలితి. ప్రజలతో మమేకమై వారికి నేరుగా సేవలు అందించాలంటే గ్రూప్స్ కరెక్ట్ అనిపించింది. దీంతో సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టా. చివరికి అనుకున్నది సాధించగలిగా.. అని గ్రూప్–2 రాష్ట్రస్థాయి 229 ర్యాంకర్ కామ్రే భాస్కర్ పేర్కొన్నా రు. గ్రూప్–2లో సాధించిన విజయం సాధించేందుకు కష్టపడిన తీరుపై సాక్షి పలకరించగా ఆయ న మాటల్లోనే... మాది కౌటాల మండలంలోని గుడ్లబోరి అనే చిన్నగ్రామం. అమ్మనాన్న లాహనుబాయి, రావూజీ. 1 నుండి పదోతరగతి వరకు మా ఊరికి సమీపంలోని విజయనగరంలో, ఇంటర్ ముధోల్ గురుకుల కళాశాలలో, డిగ్రీ హనుమకొండలో పూర్తిచేశా. గ్రూప్–2 సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2016లో మొదటి ప్రయత్నంలో గ్రూప్–2లో ఆశించిన ర్యాంకు రాలేదు. అదే సంవత్సరంలో సింగరేణిలో క్లర్క్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పరీక్ష రాయగా జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ వచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని డో ర్లిలో విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగించా. ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకు న్నా. సింగరేణి ఆధ్వర్యంలోని గోలేటి లైబ్రరీ నా కు బాగా ఉపయోగపడింది. కష్టానికి ఫలితంగా గ్రూప్–2లో 381.06 మార్కులతో రాష్ట్రస్థాయిలో 229 ర్యాంకు వచ్చింది. గ్రూప్–1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నా ప్రతీ విజయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుంది. గ్రూప్–3లోనూ 296 మార్కులతో రాష్ట్రస్థాయిలో 154వ ర్యాంకు వచ్చింది. అయితే గ్రూప్–2 జాబ్‌లోనే జాయిన్ అవుతా.
Comments
Please login to add a commentAdd a comment