కోచింగ్ లేకుండా కొలువు..
నెన్నెల: ‘పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రపేర్ అయ్యాను. గ్రూపు–2లో రాష్ట్రస్థాయిలో 172వ ర్యాంకు సాధించాను’ అని తెలిపాడు. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన మండల సుమంత్‌గౌడ్. మండల మురళిగౌడ్–ఉషారాణి దంపతుల కుమారుడు సుమంత్‌గౌడ్ పదో తరగతి వరకు మంచిర్యాల కృష్ణవేణి టాలెంట్‌స్కూల్‌లో, ఇంటర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. ధన్‌బాద్‌లో ఐఐటీలో మైనింగ్ ఇంజి నీర్ పూర్తిచేసి ఐదేళ్లుగా ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. జాబ్ చేస్తూనే గ్రూపు–4లో రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్‌బుక్స్, తెలుగు అకాడమీ వివిధ రకాల పుస్తకాల ద్వారా హైదరాబాద్‌లో స్టడీ హాల్‌లో రోజుకు పది గంటలు చదివి ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో, అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే తాను గ్రూప్–2 ర్యాంకు సాధించానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment