ఆదర్శం.. అశోక్‌కుమార్
రోజుకు పది గంటలు చదివా..
ప్రిపరేషన్‌లో భాగంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నా. తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా చేసుకున్నా. రోజుకు ఎనిమిది నుంచి పదిగంటల వరకు చదివేవాన్ని. సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసకున్నా. ఆన్‌లైన్‌లో అశోక్ సార్ క్లాస్‌లు ఫాలో అయ్యా. అలాగే తెలంగాణ ఉద్యమం సంబంధించి వి.ప్రకాశ్ సార్ బుక్స్ కూడా చదివాను. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు భగవద్గీత, పంచతంత్ర కథలను చదివాను. కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరించడంతోనే ఇది సాధ్యమైంది.
తాంసి: సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–1,2,3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు తాంసి మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్. ప్రస్తుతం సాత్నాల మండలం సుందరగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2014న కార్యదర్శిగా ఎంపికై న ఈయన సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాడు. ఈ క్రమంలో 2016లో సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే త్రుటిలో కొలువు చేజారింది. అయినా నిరాశ చెందకుండా గ్రూప్స్‌పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. గ్రూప్–1లో 399 మార్కులు సాధించగా, గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంకు, అలాగే గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంకుతో సత్తా చాటాడు.
ఆదర్శం.. అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment