యూపీఎస్సీ టార్గెట్..
మంచిర్యాలరూరల్(హాజీపూర్):ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో 2016 నుంచి యూపీఎస్సీ సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ గ్రూప్ పరీక్షలోనూ విజేతగా నిలిచాడు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల శ్రావణ్‌కుమార్. శ్రావణ్‌కుమార్ తండ్రి లింగయ్య విశ్రాంత సింగరేణి ఉద్యోగి. తల్లి కళావతి గృహిణి. అక్క స్రవంతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చెల్లె స్వర్ణలత డీఎస్సీకి సమాయత్తం అవుతోంది. శ్రావణ్‌కుమార్ భార్య సౌమ్య గృహిణి. వీరికి కూతురు స్నిగ్దశ్రీ, కుమారుడు వేదంశ్‌కృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు మంచిర్యాలలో చదివి, బీటెక్ ఈసీఈ హైదరాబాద్‌లో చదివాడు. 2016 నుంచి యూపీఎస్సీకి సమాయత్తం అవుతుండగా, 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. అయితే యూపీఎస్సీపై దృష్టి పెట్టాలని ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 2022లో మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాయగా, ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా 4 మార్కులతో మెయిన్స్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే వరసగా గ్రూప్స్ నోటీపికేషన్‌లు వెలువడటంతో అన్ని పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్స్ పరీక్షలకు ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదివాడు. గ్రూప్–4లో జిల్లా స్థాయిలో 11వ ర్యాంకు సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గ్రూప్–3లో రాష్ట్ర స్థాయిలో 39 ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 15వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులతో అర్హత సాధించగా ర్యాంకులు ప్రకటిస్తే మంచి ర్యాంకు వస్తుందని ఆశగానే ఎదురు చూస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment