పట్టుబట్టి.. కొలువు కొట్టి..
● గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లావాసులు ఎంపిక ● ఉద్యోగాలు చేస్తూనే రాష్ట్రస్థాయి ర్యాంకులు ● కోచింగ్ లేకుండానే సత్తా చాటిన వైనం..
టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1, 2, 3 ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు సత్తా చాటారు. ఉన్నతస్థాయి కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఆ మేరకు కష్టపడ్డారు. కొందరు ఉద్యోగాలు చేస్తూనే ‘గ్రూప్’ కొలువులకు ఎంపిక కాగా, మరికొందరు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగానే చదివి సత్తా చాటారు. ఇంకొందరు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం, స్ఫూర్తితో ఉద్యోగాలు సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి సర్కారు కొలువులకు ఎంపికై న పలువురి సక్సెస్ వారి మాటల్లో..
నెన్నెల: ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదల, ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రభుత్వ కొ లువు సాధించడం సులువే అంటున్నారు గ్రూ ప్–2 55వ ర్యాంకర్ చీర్ల సురేశ్‌రెడ్డి. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల మూడో కుమారుడు సురేశ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. తమది వ్యవసాయ కుటుంబమని, తాను ఇంటర్‌లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడని తెలిపారు. అమ్మ, అన్న కిషన్‌రెడ్డి ప్రోత్సాహంతో గ్రూప్– 2లో ర్యాంకు సాధించానని తెలిపారు. పదో తరగతి వరకు ఆవుడం ప్రభుత్వ పాఠశాలలో చదివానని, బీటెక్ విశాఖపట్నంలో అభ్యసించినట్లు వెల్లడించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా మొదట కానిస్టేబుల్, అనంతరం ఎన్‌పీడీఎల్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ కొలు వులు సాధించానని వెల్లడించారు. గ్రూపు–2లో ర్యాంకు సాధించేందుకు రోజుకు 8 గంటలు హైదరాబాద్‌లోని ప్రైవేట్ లైబ్రరీలో చదివానని తెలిపారు. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, సొంతంగా నోట్స్ తయారు చేసుకుని ప్రపేర్ అయ్యానని చెప్పారు. ఎన్‌సీఈఆర్టీ, తెలుగు అకాడమీకి సంబంధించిన వివిధ రకాల స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ చదివానని వెల్లడించారు. గ్రూపు–3లో కూడా రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. గ్రూపు–1 ర్యాంకు సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
కౌటాల: అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రణాళిక, లక్ష్యంతోనే విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నాడు కౌటాల మండలం తలోది గ్రామానికి చెందిన మండల సాయిరాం గౌడ్. తండ్రి రాజేశ్వంగౌడ్ వృత్తిరీత్యా గీత కార్మికుడు కాగా తల్లి తారక్క గృహిణి. పదోతరగతి వరకు కౌటాలలో, ఇంటర్ హన్మకొండలో, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. ప్రతీరోజు వార్తా పత్రికలు, ప్రామాణిక పుస్తకాలు చదవడం, ప్రభుత్వ వైబ్‌సైట్‌లో విషయాలు తెలుసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానన్నారు. తెలుగు అకాడమీ, ఇతర ప్రైవేటు పుస్తకాలు, కరంట్ అఫైర్స్‌కు ‘సాక్షి’ దినపత్రికతో పాటు పలు మ్యాగజైన్లపై ఆధారపడ్డానన్నారు. పత్రికల్లో ఎడిటోరియల్ చదవడం ద్వారా అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకున్నానన్నారు. చదువుకునే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, అక్కా, బావ, మిత్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. 2019 ఏప్రిల్‌లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించానన్నారు. అందరి సహకారంతోనే గ్రూప్స్ పరీక్షల్లో విజయం సాధించానని తెలిపారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంగా ఏర్పర్చుకున్నానన్నారు.
కష్టపడితే కొలువు సులువే
ప్రణాళిక, లక్ష్యంతోనే విజయం
పట్టుబట్టి.. కొలువు కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment