సింగరేణి సీఎండీ ప్రోత్సాహం.. అమ్మానాన్నల ఆశీర్వాదం
● గ్రూప్–1 సాధించడమే నా డ్రీమ్
● కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే..
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ రాం సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే 19వ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. సింగరేణి సీఎండీ బలరాం ప్రోత్సాహం, అమ్మానాన్నల ఆశీర్వాదంతో విజయం సాధించానన్నారు. తన సక్సెస్‌కు కారణాలు, అనుభవాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఒకటవ తరగతి నుంచి పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నానన్నారు. 2014లో బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్‌లో చేరానని, 2021లో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సాధించి నెలకు రూ.50 వేల వేతనం పొందానన్నారు. 2022లో సింగరేణి నిర్వహించిన పరీక్షలో పాసై జాబ్ సంపాదించా. ఆ సమయంలో సీఎండీ బలరాం నేను జీవితంలో ఉన్నతస్థాయికి చేరేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఒక్కోమెట్టు ఎక్కుతున్నా. జాబ్ చేస్తున్న సమయంలోనే 2023లో గ్రూప్–4లో రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించానన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ ఆడిట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నానన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్–3లో రాష్ట్రంలో 12వ ర్యాంకు సాధించగా తర్వాత విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోనల్‌లో 4వ ర్యాంకు సాధించి తన లక్ష్యానికి చేరువవుతున్నానన్నారు. ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంటివద్దే ఉండి ఆన్‌లైన్‌లో తీసుకున్న పుస్తకాలనే చదువుతున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment