నిషేధిత పత్తివిత్తనాలు పట్టివేత
● ఆరుగురు అరెస్ట్
మంచిర్యాలక్రైం: మంచిర్యాల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత పత్తి విత్తనాలు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఏఈవో తాడూరి మహేందర్‌కు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో దాడిచేసి కింటల్ నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందూర్ గ్రామానికి చెందిన పెట్యాల జగదీశ్వర్‌రావు నిషేధిత హెచ్‌టీ, జీటీ–3 పత్తి విత్తనాలు మంచిర్యాల జిల్లాలో అధిక ధరలకు విక్రయించేందుకు రైలు మార్గం తీసుకువచ్చాడు. మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన కడియాల ఉదయ్, పొట్టల మధుసూదన్, మరిశెట్టి నరేందర్, బెల్లంపెల్లి మండలం ఆకెనపెల్లికి చెందిన సిద్ధం శేఖర్, తిర్యాణికి చెందిన కాటవెణి సాయి, సుబ్బరావుపల్లికి చెందిన నాగెళ్లి మోహన్‌గాంధీతో కలిసి విక్రయించేందుకు తెచ్చాడు. స్థానికంగా ఉండే మల్లికార్జున్ అతనికి సహకరించాడు. అయితే పక్కా సమాచారంతో దాడిచేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఏఈవో మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టుబడిన నిషేధిత పత్తి విత్తనాలతోపాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న విత్తనాల విలువ రూ.1.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment