
ఆంగ్లభాషపై ప్రావీణ్యం పెంచుకోవాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): ఆంగ్లభాషపై విద్యార్థులు ప్రావీణ్యం పెంచుకుని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశ మందిరంలో స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు బోస్ సంస్థ అందిస్తున్న సేవలతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. వేసవి సెలవుల్లోను విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఏసీఎం జగన్ మాట్లాడుతూ విద్యార్థి తలరాతను మార్చేది ఉపాధ్యాయులే అన్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక, ఆంగ్ల నాటికలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఏసీఎంవోలు ఉదవ్, రాథోడ్ శివాజీ, క్రీడల అధికారి పార్థసారథి, దేవ్‌రావు, బోస్ సంస్థ నిర్వాహకులు రోమిల, నిక్షిత, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment