
అదుపుతప్పి ఆటో బోల్తా
● ఆరుగురికి స్వల్పగాయాలు
సారంగపూర్(నిర్మల్): అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లోని శంకర్‌నాయక్ తండావాసులు మంగళవారం మండల కేంద్రంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా సారంగాపూర్–అడెల్లి గ్రామాల మధ్య కుక్క అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో అందులో ప్రయాణిస్తున్న రాథోడ్ మారుణిబాయి, నీలాబాయి, సవిత, శశికళ, అన్నపూర్ణ, రతన్‌సింగ్‌కు స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందివ్వడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment