● పోక్సో కేసు నమోదు ● మందమర్రిలో ఘటన
మందమర్రిరూరల్: కూతురిపై అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదైంది. పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్‌లో ఎస్సై రాజశేఖర్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన ఆకుదారి సతీశ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకా లంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. పెద్ద కూతురు (15) హాస్టల్‌లో చదువుతుండగా పోచమ్మకు చేసుకునేది ఉందని మంగళవారం తీసుకువచ్చాడు. సాయంత్రం మద్యం తాగి ఇంటికి చేరుకుని కూతురుు తనకు పుట్టలేదని అనుమానంతో ఆమైపె రాత్రి ఆసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను గాయపరిచాడు. భార్య ఫిర్యాదుతో బుధవారం పోక్సో కేసు న మోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలిని కౌన్సెలింగ్ నిమి త్తం భరోసా కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు.