జైపూర్: ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని, రూ.5వేలు అలవెన్స్ చెల్లించాలని బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి చైర్మన్ ఎన్.బలరాంను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జి, జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య వినతిపత్రం అందజేశారు. గత ఏడాది డిసెంబర్‌లో డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషన్ అధ్యక్షతన జరిగిన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. బీఎంఎస్ ఎస్టీపీపీ జనరల్ సెక్రెటరీ దుస్స భాస్కర్, బీఎంఎస్ నాయకులు పులి రాజిరెడ్డి, మండ రమాకాంత్, శ్రీధర్, పెద్దిరెడ్డి కిషన్‌రెడ్డి, శివకృష్ణ, చిలకాని వెంకటేష్, సతీష్ పాల్గొన్నారు.