
బండల్‌నాగాపూర్ వాసి ప్రతిభ
తాంసి: మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్‌రెడ్డి గ్రూప్–1లో 454.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 503 ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్–4 ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ముంబయిలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. సివిల్స్ సాధించడమే లక్ష్యమని సచిన్‌రెడ్డి పేర్కొన్నాడు. ఈయన తల్లిదండ్రులు మంజుల–శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించిన సచిన్‌రెడ్డిని పలువురు అభినందించారు.