
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
తిర్యాణి: మండలంలోని మొర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల లోయ గ్రామంలో టేకం జంగుకు చెందిన ఇల్లు ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు తెలి పిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఇంట్లో దేవుళ్ల చిత్రపటాల వద్ద దీపం వెలిగించారు. ప్రమాదవశాత్తు ఇంట్లోని వివిధ వస్తువులకు అంటుకుని మంటలు చెలరేగడంతో ఇల్లు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. తహసీల్దార్ సూర్యప్రకాష్ ఘటన స్థలానికి చేరుకుని పంచనా మా నిర్వహించారు. బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందజేశారు. నష్టం అంచనా వేసి ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందజేస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.