
చదువుతో జీవితంలో అన్నీ సాధించవచ్చు
కాసిపేట: చదువుతో జీవితంలో అన్నీ సాధించుకోవచ్చని, విద్యార్థినులు ఇష్టపడి చదివి భవిష్యత్‌లో తమ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం మండలంలోని దేవాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓరియంట్ సిమెంటు కంపెనీ అందించిన స్కూల్ బ్యాగులను ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతువేదికలో జిల్లా ఆరోగ్యశాఖ, వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బుగ్గగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, తహసీల్దార్ భోజన్న, ఏంపీడీవో సత్యనారాయణసింగ్, ఏంపీవో సబ్ధర్ అలీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం:
ఎమ్మెల్యే వినోద్
మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తెలి పారు. మండల కేంద్రంలో జై బాపు, జై భీం, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం, పాదయాత్రలో పాల్గొని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం ప్రదీప్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, మైదం రమేష్, నస్పూరి నర్సింగ్ పాల్గొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్